పరిసరాల పరిశుభ్రతతోనే దోమలను నివారించవచ్చు...... హెల్త్ అసిస్టెంట్ లింగ్ రామకృష్ణ
మునగాల 05 జూలై 2024 తెలంగాణ వార్తా ప్రతినిధి :- మునగాల మండలం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం రేపాల ఆధ్వర్యంలో నర్సిoహులగూడెం గ్రామంలో వైద్య సిబ్బంది సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ఇంటింటి సర్వే నిర్వహించి ప్రజలకు అవగాహన కల్పించారు.. హెల్త్ అసిస్టెంట్ లింగం రామకృష్ణ మాట్లాడుతూ ప్రజలు సీజనల్ వ్యాధుల బారిన పడకుండా ఉండాలంటే పరిసరాల పరిశుభ్రత , దోమలు పుట్టకుండా కుట్టకుండా చూసుకోవాలి.. వారానికి ఒక్క సారి మీ యొక్క ఇండ్లలో నీటి తొట్లు, గాబులు పూల కుండీలు, కూలర్లు, టైర్లు , నీటి నిలువలను తీసివేయాలి.. వాడి పడేసిన కొబ్బరి బొండా లు, ప్లాస్టిక్ టబ్బులు, వ్యర్థమైన పరికరాలు పడవేయాలి.. డెంగ్యూ, మలేరియా, చికెన్ గున్యా, బోదకాలు, మెదడు వాపు వ్యాధుల బారిన పడకుండా మతెరలు వాడాలని తెలిపారు.. ప్రజలు మరుగుదొడ్లను ఉపయోగించుకోవాలి , గాలి గొట్టాలకు జాలీలు అమర్చుకోవాలి... వైద్య సిబ్బంది మురికి నీటి నిలువల్లో దోమ లార్వా నివారణకు టెమీపాస్ ద్రావణాన్ని పోసినారు.. ప్రతి ఒక్కరు వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలని తెలిపారు.. ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో అన్ని రకాల రక్త పరీక్షలు నిర్వహిస్తారు. పాము కాటు, తేలుకాటు ,కుక్క కాటుకు మందులు అందుబాటులో ఉన్నాయి ప్రజలు వైద్య సేవలను వినియోగించుకోవాలని
తెలిపారు..
ఈ కార్యక్రమంలో
ఏ ఎన్ ఎం లు కె.పద్మ ,
పి.పావని, ఆశా కార్యకర్తలు జ్యోతి, రమణ సుధారాణి ,లక్ష్మి, నాగమ్మ, విజయలక్ష్మి తదితరులు పాల్గొనడం జరిగింది.