చైనా మాంజ విక్రయిస్తే చర్యలు తప్పవు ఎస్సై వెంకట్ రెడ్డి

Dec 29, 2025 - 21:14
 0  63
చైనా మాంజ విక్రయిస్తే చర్యలు తప్పవు ఎస్సై వెంకట్ రెడ్డి

తిరుమలగిరి 30 డిసెంబర్ 2025 తెలంగాణ వార్త రిపోర్టర్

నిషేధిత చైనా మాంజా అమ్మినా, కొన్నా కఠిన చర్యలు తప్పవు అని సూర్యాపేట జిల్లా తిరుమలగిరి ఎస్సై వెంకట్ రెడ్డి హెచ్చరించారు. ఈ సందర్భంగా విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ సంక్రాంతి పండుగ సందర్భంగా గాలిపటాలు ఎగురవేయడం మన ఆనవాయితీ అయితే, కొంతమంది నిషేధిత చైనా మాంజా (సింథటిక్/నైలాన్ దారం) వినియోగిస్తుండటం వల్ల పక్షులు, మూగజీవాలు, మనుషుల ప్రాణాలకు తీవ్ర ముప్పు వాటిల్లుతోంది అని అన్నారు. ఈ నేపథ్యంలో ప్రజల భద్రత దృష్ట్యా పోలీసుశాఖ కఠిన నిబంధనలు అమలు చేస్తోంది అని తెలియజేశారు. చైనా మాంజా వల్ల ప్రాణాపాయం కలుగుతుంది అని అన్నారు. ఈ దారం గాజు పొడి, ఇతర రసాయనాలతో తయారు చేయబడటం వల్ల అత్యంత పదునుగా ఉంటుంది. దీనివల్ల ద్విచక్ర వాహనదారులు, పాదచారుల గొంతు కోసుకుపోయి ప్రాణాపాయం సంభవించే అవకాశాలు ఉన్నాయని ఆకాశంలో ఎగిరే పక్షులు ఈ దారంలో చిక్కుకుని, రెక్కలు తెగిపోయి మరణిస్తున్నాయన్నారు. ఈ ప్లాస్టిక్/నైలాన్ దారం భూమిలో కరగదు దీనివల్ల పర్యావరణానికి తీవ్ర విఘాతం కలుగుతుంది. ఈ దారం విద్యుత్ తీగలకు తగిలినప్పుడు విద్యుత్ ప్రవాహం జరిగి షాక్ కొట్టే ప్రమాదం ఉంది అని అన్నారు.

జేరిపోతుల రాంకుమార్ తిరుమలగిరి విలేకరి మరియు తుంగతుర్తి నియోజకవర్గం ఇన్చార్జి