బిసి రిజర్వేషన్, ఎస్సీ వర్గీకరణ బిల్లులను అసెంబ్లీలో ఏకగ్రీవ ఆమోదం తెలిపిన సందర్భంగా

Mar 19, 2025 - 18:36
 0  4
బిసి రిజర్వేషన్, ఎస్సీ వర్గీకరణ బిల్లులను అసెంబ్లీలో ఏకగ్రీవ ఆమోదం తెలిపిన సందర్భంగా

ధరూర్ మండల కేంద్రంలో సీఎం రేవంత్ రెడ్డికి పాలాభిషేకం..

జోగులాంబ గద్వాల 19 మార్చి 2025 తెలంగాణ వార్త ప్రతినిధి ధరూర్. బిసి రిజర్వేషన్‌, ఎస్సీ వర్గీకరణ బిల్లులను ఆమోదం తెలుపుతూ అసెంబ్లీ సమావేశంలో క్యాబినెట్ నిర్ణయం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ గద్వాల నియోజకవర్గం ధరూర్ మండల కేంద్రంలోని వైఎస్ఆర్ సర్కిల్ నందు జెడ్పి మాజ చైర్ పర్సన్,గద్వాల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జీ సరితమ్మ ఆదేశానుసారం తెలంగాణ రాష్ట్రంలోని బిసి,ఎస్సీ బిల్లులకు ఆమోదం తెలిపిన సీఎం రేవంత్ రెడ్డికి క్యాబినెట్ సభ్యులకు ధన్యవాదాలు తెలుపుతూ ధరూర్ మండల కాంగ్రెస్ పార్టీ నాయకుల అధ్వర్యంలో సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటాన్నికి పాలాభిషేకం నిర్వహించారు..  తెలంగాణ రాష్ట్రంలో ఎన్నో శతాబ్దాల నుంచి ఎదురుచూస్తున్న బిసీ, ఎస్సీ వర్గీకరణ బిల్లులను ఆమోదం తెలిపి రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి  రెండు బిల్లులను అసెంబ్లీలో ఆమోదం తెలిపి పార్లమెంటుకు రాష్ట్ర ప్రభుత్వం పంపించే బిల్లును కేంద్ర బిజెపి ప్రభుత్వం పార్లమెంటులో బిసీ  రిజర్వేషన్ బిల్లును,ఎస్సీ వర్గీకరణ ఆమోదం చేయాలని కాంగ్రెస్ పార్టీ నాయకులు కోరారు..

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు డి.ఆర్.శ్రీధర్, పటేల్ శ్రీనివాసులు, చింతరేవుల సురేష్, కపట్రల వెంకట్ రెడ్డి, రంగస్వామి గౌడ్, వానపల్లి ప్రహ్లాద్,భీంపురం రాఘు,ఓబులోనిపల్లి పరుశరాముడు,జంగిలప్ప,మర్లబీడ్ రాము,గోవింద్, పెద్ద సవారన్న,దర్రెప్ప,ఏసన్న తదితరులు ఉన్నారు...

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333