కారణం చెప్పకుండా నామినేషన్ రిజెక్ట్ చేసిన అధికారినీ సస్పెండ్ చేయాలి

Dec 2, 2025 - 21:50
 0  0
కారణం చెప్పకుండా నామినేషన్ రిజెక్ట్ చేసిన అధికారినీ సస్పెండ్ చేయాలి

తెలంగాణ వార్త ఆత్మకూరు ఎస్ కారణం చెప్పకుండా నామినేషన్ రిజెక్ట్ చేసిన అధికారినీ సస్పెండ్ చేయాలి. ఆత్మకూరు ఎస్.. మండల పరిధిలోని గట్టికల్లు గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా నామినేషన్ వేసిన మడ్డి వెంకన్న నామినేషన్ ఫారాన్ని ఎలాంటి కారణం లేకుండా సమాచారం ఇవ్వకుండా రిజెక్ట్ చేయడం పట్ల తీవ్రంగా ఖండిస్తున్నామని బాధితుడు ఆరోపించారు. మంగళవారం ఆయన స్థానిక విలేకరులతో మాట్లాడుతూ నామినేషన్ వేసేటప్పుడు అన్ని సక్రమంగానే రాసి రెండు జతల నామినేషన్లు వేసినప్పటికీ కనీసం చెక్ లిస్టు కూడా ఇవ్వకుండా రిటర్నింగ్ అధికారి తన నామినేషన్లను తీసుకొని ఎలాంటి కారణం చూపించకుండా రిజెక్ట్ చేశారని ఆయన ఆరోపించాడు. రిజర్వేషన్ నామినేషన్ పత్రాలలో తప్పులు చూపించాలని ఆందోళన చేసినప్పటికీ ఎలాంటి తప్పు చూపించకుండా ఆర్డీవో దగ్గర అప్పిలు చేసుకోమని చెప్పి రెండు రోజులుగా ఆర్డీవో కార్యాలయం చుట్టూ తిరిగినా పట్టించుకోకుండా కారణం చూపించకుండానే తన నామినేషన్ రిజెక్ట్ చేయడం పట్ల అధికారుల పనితీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రిటర్నింగ్ అధికారి కొంతమంది రాజకీయ నాయకులు చెప్పినట్లు వారి అడుగుజాడల్లో పనిచేస్తూ మండల స్థాయి అధికారులు సైతం ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని ఆయన ఆరోపించాడు. ప్రతిపక్ష పార్టీల కు చెందిన అభ్యర్ధుల నామినేషన్ లు మాత్రమే రిజెక్ట్ చేస్తున్నారని వీరిపై కలెక్టర్కు ఫిర్యాదు చేసి కోర్ట్ ని ఆశ్రయించనునట్లు తెలిపారు.