బిషప్ సుదర్శనమును సన్మానించిన పెనియేలు సంఘం
మునగాల 14 జులై 2024
తెలంగాణ వార్తా ప్రతినిధి :-
కోదాడ పట్టణంలో నిర్వహించిన కోదాడ నియోజకవర్గ పాస్టర్స్ ఫెలోషిప్ నూతన కమిటీ సమావేశంలో అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికైన బిషప్ డాక్టర్ జె సుదర్శనంను మునగాలలోని పెనుయేలు వర్షిప్ సెంటర్ సంఘం ఆదివారం పెనుయేలు వర్షిప్ సెంటర్ చర్చిలో జరిగిన ప్రత్యేక సన్మాన కార్యక్రమంలో బిషప్ డాక్టర్ జె సుదర్శనంను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా బిషప్ డాక్టర్ జె సుదర్శనం మాట్లాడుతూ, కోదాడ నియోజకవర్గంలోని క్రైస్తవులకు ప్రభుత్వం నుండి రావలసిన రాయితీలను అందజేయడానికి తప్పకుండా కృషి చేస్తామని తెలిపారు. అంతేకాక ఎవరైనా బిసిసి సర్టిఫికెట్ పొందడానికి సమస్యలు ఎదుర్కొంటున్నట్లయితే తప్పకుండా తమ దృష్టికి తీసుకురావాలని తెలిపారు. ఆ విషయంలో సంబంధిత రెవెన్యూ అధికారులతో మాట్లాడి తప్పకుండా సమస్య పరిష్కారం అయ్యే విధంగా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. నియోజకవర్గంలోని ప్రతి మండల కేంద్రంలో క్రైస్తవుల సమాధులకు స్థలాలు, క్రిస్టియన్ భవన్ ల నిర్మాణం, క్రిస్టియన్ మైనార్టీలకు సంబంధించిన లోన్లు తదితరాంశాలపై ప్రత్యేక దృష్టి పెట్టి క్రైస్తవులకు న్యాయం జరిగే వరకూ పోరాడుతామని తెలిపారు. తనకు ప్రత్యేక సన్మానం చేసిన మునగాల పెనుయేలు వర్షిప్ సెంటర్ సంఘానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కె. రాజు, పి. కరుణ, జె. మార్తమ్మ, ఎల్. పూలమ్మ, కె. ఉపేందర్, కత్తి శ్రీను, ఎస్. వాణి, తబిత, తిరుమల, సంతోషమ్మ, పి. కరుణాకర్, ఎల్. అంజలి, ఎల్. వినోద్ తదితరులు పాల్గొన్నారు.