జిల్లాలో జరిగే ఎమ్మార్పీఎస్ సదస్సును విజయవంతం చేయండి  

Jan 30, 2026 - 19:57
 0  2
జిల్లాలో జరిగే ఎమ్మార్పీఎస్ సదస్సును విజయవంతం చేయండి  

అడ్డగూడూరు 30 జనవరి 20026 తెలంగాణవార్త రిపోర్టర్:– ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షులు మేడి పాపన్న ఆదేశానుసారం జిల్లా అధ్యక్షులు భూషి మహేష్ పిలుపు మేరకు 3.2.2026నా యాదాద్రి భువనగిరి జిల్లా సదస్సును జయప్రదం చేయుటకై అడ్డగూడూరు మండల కేంద్రంలో విలేకరుల సమావేశం నిర్వహించారు.ఇట్టి కార్యక్రమంలో యాదాద్రి భువనగిరి జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ బాలెoల  పరుశరాములు మాదిగ  అడ్డగూడూరు ఎంఆర్పిఎస్ మండల అధ్యక్షులు ఇటికాల ఆంజనేయులు మాదిగ ఈ సందర్భంగా మాట్లాడుతూ..జరగబోయే భువనగిరి జిల్లా సదస్సును అడ్డగూడూరు మండలం నుండి అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయవలసిందిగా కోరారు. మాదిగ జాతి కోసం 30 సంవత్సరాల సుదీర్ఘ పోరాటంలో పాల్గొన్న మన మేడి పాపన్న నాయకత్వంలో పోరాటం చేస్తూ సామాజికంగా హార్దికంగా అణచివేతకు గురవుతున్న మాదిగల అభ్యున్నతి కోసం ప్రభుత్వం తక్షణమే ప్రత్యేక చర్యలు చ చేపట్టాలని డిమాండ్ చేస్తూ ఎస్సీ కార్పొరేషనకు పదివేల కోట్ల నిధులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ..అలాగే గత ప్రభుత్వం దళిత బంధు పేరుతో 3 లక్షల రూపాయలను అకౌంట్లో వేయడం జరిగింది.కానీ అకౌంట్ లో ఫ్రీజింగ్ లో ఉండడం వలన ఆ యొక్క డబ్బులు లబ్ధిదారులకు చెందడం లేదు తక్షణమే అకౌంట్లో ఫ్రీజింగ్ తీసివేసి మిగతా ఏడు లక్షలు గ్రౌంఢీంగ్ రిలీజ్ చేయవలసిందిగా ప్రభుత్వాన్ని కోరుచున్నాము అని తెలిపారు.రేపు జరగబోయే జిల్లా సదస్సును అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయవలసిందనీ అన్నారు.ఈ కార్యక్రమంలో బాలేoల.బాబురావు, మందుల అవిలయ్య, బాలెoల బాబు, తదితరులు పాల్గొన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333