బిజెపి పార్టీ తెలంగాణ రాష్ట్ర కమిటీ అధ్యక్షులుగా చింత సాంబమూర్తిని నియామకం చేయాలి
తల్లమల్ల హసేన్ మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షులు

సూర్యాపేట, 23 మార్చి 2025 తెలంగాణవార్త రిపోర్టర్:- చింత సాంబమూర్తి గారు దక్షిణ భారత దేశంలో భారతీయ జనతా పార్టీ నుండి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో 40 సంవత్సరాల క్రితమే నల్లగొండ మున్సిపల్ చైర్మన్ గా పనిచేశారు పట్టణ అభివృద్ధికి ఎంతో కృషి చేశారు బిజెపి పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా దళిత మోర్చా రాష్ట్ర అధ్యక్షులుగా సేవలను అందించి పార్టీ అభివృద్ధికి కృషి చేశారు చింత సాంబమూర్తి గారిని భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర కమిటీ అధ్యక్షులుగా నియామకం చేయాలని మాల మహానాడు తెలంగాణ రాష్ట్ర కమిటీ అధ్యక్షులు ప్రముఖ న్యాయవాది తల్లమల్ల హసేన్ బిజెపి పార్టీ కేంద్ర నాయకత్వాన్ని కోరినారు నల్లగొండ జిల్లా కేంద్రంలో క్రమశిక్షణ గల సైనికుడిలా భారతీయ జనతా పార్టీలో అనేక సేవలను అందించిన చింత సాంబమూర్తి గారు అన్ని వర్గాల అభిమానాన్ని పొందిన గొప్ప నాయకుడని వారి సేవలను గుర్తించి బిజెపి పార్టీ అన్ని విధాల ప్రోత్సహించి ముందుకు నడిపించాలని కోరినారు