హత్య కేసులో 13 మంది నింధుతుల అరెస్ట్.

- మిర్యాల గ్రామంలో మెంచు చక్రయ్య గౌడ్ హత్య కేసులో 13 మంది నింధుతుల అరెస్ట్.
- జిల్లా పోలీసు కార్యలయం నందు నిర్వహించిన విలేకరుల సమావేశం నంధు నింధితుల అరెస్ట్ వివరాలు వెల్లడించిన జిల్లా ఎస్పీ నరసింహ.
మిర్యాల, 23 మార్చి 2025 తెలంగాణవార్త రిపోర్టర్:- ఈనెల 17 వ తేదీన నూతనకల్ పోలీస్ స్టేషన్ పరిధి మిర్యాల గ్రామంలో జరిగిన మెంచు చక్రయ్య గౌడ్ హత్యకు సంభందించి 13 మంధిని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించామని జిల్లా ఎస్పీ నరసింహ IPS గారు అన్నారు. సూర్యాపేట DSP రవి, తుంగతుర్తి సర్కిల్ CI శ్రీను, నూతనకల్ SI మహేందరనాధ్ లతో కలిసి జిల్లా పోలీసు కార్యలయం నంధు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ గారు మాట్లాడుతూ ఈ నెల 17 వ తేదీన నుతనకల్ మండలం మిర్యాల గ్రామంలో సాయంత్రం సమయంలో సుమారు 4:30 నుండి 5 గంటల సమయంలో గ్రామ పెద్ద గా ఉన్న మెంచు చక్రయ్య గౌడ్ ను అదే గ్రామానికి చెందిన దుండగులు కర్రలు, మారణ ఆయుదాలతో దాడి చేసి అత్యంత పాశవికంగా హత్యచేయడం జరిగినది. దీనిపై నూతనకల్ పోలీస్ స్టేషన్ నందు హత్యకేసు నమోదు చేశాం. దీనికి సంభందించి సూర్యాపేట జిల్లా పోలీసులు, ఉన్నత స్థాయి పోలీసు అధికారులు చాలా సీరియస్ గా తీసుకోవడం జరిగినది. దీనిలో భాగంగా నేరానికి పాల్పడిన వారిని పట్టుకోవడం కోసం ప్రత్యేక పోలీసు బృందాలు ఏర్పాటు చేయడం జరిగినది. ఈ రోజు అనగా 24-03-2025 రోజున ఉదయం తుంగతుర్తి పరిధిలో వాహనాలు తనికి చేస్తుండగా మెంచు చక్రయ్య హత్యలో పాల్గొన్న వ్యక్తి ని, హత్యకు కుట్ర పన్నిన సొంత కుటుంభ సబ్యులైన అల్లుడు A1 కనకటి వెంకన్న @ వెంకటేశ్వర్లు, వెంకన్న భార్య A-20 సునీత తో కలిపి మొత్తం 13 మందిని ఆధుపులోకి తీసుకోవడం జరిగినది. వీరిని విచారించగా హత్యకు ఎలా పథకం పన్నారు, ఎలా హత్య చేశారు అనేది స్వచ్చందంగా ఒప్పుకున్నారు. దీనిని కేసు దర్యాప్తు లో నమోదు చేయడం జరిగినది. ప్రదానంగా ఈనెల 13 వ తేదీన గ్రామ బొడ్డురాయి మహోత్సవం సందర్భంగా అందరూ కలిసి చక్రయ్య హత్యకు పన్నాగం పన్నారు, గ్రామంలో అన్నీ కార్యకలాపాల్లో చక్రయ్య ఆదిపత్యం కొనసాగుతున్నది, మనకు అడ్డువస్తున్నాడు అని అడ్డుతప్పించాలని నిర్నైంచుకున్నారు. మిర్యాల గ్రామానికి చెందిన చక్రయ్య గత 30, 40 సంవత్సరాలుగా గ్రామంలో గ్రామ పెద్దగా చలామణి అవుతూ గ్రామ సర్పంచి గా పని చేశాడు, తన మూడవ కూతురుని కూడా సర్పంచ్ చేసినారు, అల్లుడు కనకటి వెంకన్న ను పిఏసిఎస్ చైర్మెన్ చేశారు. ఒక కుటుంభ సబ్యులుగా కలిసి ఉంటూ, కనకటి వెంకన్న పిఏసిఎస్ చైర్మెన్ అయిన్నప్పటి నుండి వెంకన్న నూతనకల్ మండలంలో తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తున్నాడు. గ్రామంలో మెంచు చక్రయ్య ఆదిపత్యం ఉండడం వెంకన్న వర్గీయులు సహించలేక పోయారు, వ్యతిరేకంగా ఒక గ్రూపు గా ఏర్పడ్డారు. ఇలా వారి మద్య మనస్పర్ధలు కొనసాగుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికల అనంతరం 2023 సం.లో మెంచు చక్రయ్య కాంగ్రెస్ పార్టీలోకి వచ్చాడు, 2024 సం.లో కనకటి వెంకన్న కాంగ్రెస్ లోకి వచ్చారు, అయినప్పటికి చక్రయ్య ఆధిపత్యం కొంసాగిస్తున్న చక్రయ్యను అడ్డు తొలగించి నిర్నైంచుకున్నారు. ఈ నెల 13 వతేదీన జరిగిన బొడ్రాయి ఉత్సవాలు దీనికి ఆజ్యం పోశాయి. గతంలో చూస్తే గతంలో A1 కనకటి వెంకన్న ఆధీనంలో ఉత్సవాలు జరిగేవి, చక్రయ్య ఈ సారి ఉత్సవాలను తన అధ్వర్యంలో జరపాలని బహిరంగంగా ప్రకటించిన దానిని తట్టుకోలేక చక్రయ్యను అడ్డుతొలగించాలని కనకటి వెంకన్న గ్రూప్ సబ్యులు అందరినీ పురామచి మీరు ప్రత్యక్షంగా పాల్గొనాలని పరోక్షంగా సహకారం అందిస్తానని వెంకన్న తెలిపినారు. ఏ1, తన కుటుంబ సభ్యులు మరియు తన అనుచరులతో తన మామ మృతుడు మెంచు చక్రయ్యను చంపడానికి తన ఇంటి వద్ద పథకం పన్ని తన పథకం లో భాగంగా తేధి; 17.03.2025 రోజున తన అనుచరులైన 1) కనకటి శ్రవణ్ 2) కనకటి లింగయ్య 3) కనకటి ఉప్పలయ్య 4) కనకటి శ్రీకాంత్ 5) గంధసిరి వెంకటేష్ 6) పెద్దింటి మధు 7) పెద్దింటి గణేష్ ల పురమాయించి ప్రతిరోజూ తన వ్యవసాయ పొలానికి వెళ్ళి వస్తున్న చక్రయ్యను అడ్డగించి ఆయుదాలు మరియు వెదురు కర్రలతో అతి కిరాతకంగా హత్య చేశారు. ఇది అంతా దూరంగా చెట్ల పొదల్లో ఉండి గమనిస్తున్న కనకటి వెంకన్న, చక్రయ్య చనిపోయాడు అని నిర్ధారించుకుని అక్కడి నుండి అందరూ పారిపోయారు. నేరం చేసేటప్పుడు మొబైల్ ఫోన్స్ వాడితే దొరికిపోతామని గ్రహించి ఫోన్ లు అన్నీ స్వీచాఫ్ చేసి కొత్త ఫోన్ లు కొత్త నంబర్ లు తీసుకుని నేరానికి పాల్పడ్డారు. తెలిసిన నంబర్లు పేపర్ మీదరాసుకున్నారు, పేపర్ను స్వాదినం చేసుకున్నాం.
మిర్యాల గ్రామంలో మంచి వాతావరణం నెలకొల్పడం కోసం పోలీసు ఉన్న అధికారులు, జిల్లా పోలీసులు ఈ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకోవడం జరిగినది. ఈ కేసులో ప్రత్యక్షంగా పరోక్షంగా పాల్గొన్న వారిని ఎవరిని వదిలిపెట్టకుండా అందరిపై కచ్చితమైన ఆధారాలు సేకరిస్తూ దర్యాప్తుని పారదర్శకంగా చేస్తూ అందరికీ కఠినమైన శిక్షలు పడెలాగా పోలీస్ శాఖ కృషి చేస్తుంది. ఈ మధ్యకాలంలో గమనించినట్లయితే చాలావరకు హత్య కేసుల్లో జీవిత ఖైదు, ఉరిశిక్షలు పడుతున్నాయి. దీనికి సంభందించి ప్రత్యక్ష నిందితులను కస్టడీ పిటిషన్ వేసి కస్టడీలోకి తీసుకుని దర్యాప్తు చేశాము. త్వరితగతిన ఫాస్ట్ ట్రాక్ బెస్ లో శిక్ష పడేలా పోలీస్ శాఖ ప్రతిష్టాత్మకంగా తీసుకుని త్వరితగతిన కఠిన శిక్షలు పడేలా పోలీస్ శాఖ పని చేస్తుంది అన్నారు. ఈ కేసులో బాగా పని చేసి నేరస్తులను పట్టుకోవడం కృషి చేసిన అందరికీ రివార్డ్స్ అందించాం అన్నారు. ఇట్టి కేసు ఛేదించడము సమర్దవంతంగా పని చేసిన సూర్యపేట DSP G రవి, డి.శ్రీను, సర్కిల్-ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీసు, తుంగతుర్తి, ఐ. మహేంద్రనాథ్, ఎస్ఐ- నూతనకల్, ఎం.వీరయ్య, ఎస్ఐ- మద్దిరాల, ఆర్. క్రాంతి కుమార్, ఎస్ఐ-తుంగతుర్తి మరియు నూతనకల్ పోలీసు స్టేషన్ సిబ్బందిని అబినంధించారు.
నేరస్తుల నుండి స్వాదీనము చేసుకున్న వాటి వివరములు :
- రెండు కార్లు (ఇన్నో వా క్రిస్టా మరియు స్వి ఫ్ట్ కారు),
- ఒక కర్ర, 10 సెల్ ఫోన్ లు
- ఫోన్ నెంబర్లు వ్రాయబడి ఉన్న కాగితపు ముక్క స్వా ధీనం.
ఈరోజు అరెస్ట్ చేయబడిన నింధితుల వివరములు :*
A-1 కనకటి వెంకన్న , A-8 కనకటి ఉప్పలయ్య , A-10: దిండిగల నగేశ్, A-12: జక్కి పరమేష్ , A-15: మన్నెం రమేశ్, A-16: కనకటి వెంకన్న @ మొండి వెంకన్న , A-20: కనకటి సునీత భర్త; వెంకటేశ్వర్లు, A-21: కనకటి శ్రావ్య, , A-22: కనకటి స్వరూప భర్త; ఉప్పలయ్య, , A-23: కనకటి కల్యాణి భర్త; లింగయ్య , A-24: కనకటి/ వర్దెల్లి అనూష భర్త; మహేశ్, A-29: జక్కి స్వ ప్నా భర్త; పరమేష్, A-35: భారీ సతీష్