యుగంధర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు
సూర్యాపేట జిల్లా రియల్ ఎస్టేట్ వ్యాపార అసోసియేషన్ అధ్యక్షుడు పంతంగి వీరస్వామి గౌడ్

సూర్యాపేట, టౌన్ మార్చి 24:- సూర్యాపేట మున్సిపాలిటీ పరిధిలో కోమటికుంట గ్రామంలో బాల్యమిత్రుడు పిట్టల యుగంధర్ దశదినకర్మలో సోమవారం ఎంజి నగర్ తండా ఫంక్షన్ హాల్ కు హాజరైన సూర్యాపేట జిల్లా రియల్ ఎస్టేట్ వ్యాపార అసోసియేషన్ అధ్యక్షుడు పంతంగి వీరస్వామి గౌడ్ తోటి స్నేహితులు పూర్వ విద్యార్థులు అందరూ కలిసి పిట్టల యుగంధర్ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా పంతంగి వీరస్వామి గౌడ్ మాట్లాడుతూ పిట్టల యుగంధర్ ఆత్మ శాంతించాలని వారి పిల్లలు ఉన్నత శిఖరాలు ఎదగాలని ఆకాంక్షించారు. ప్రతి ఒక్కరు ఇన్సూరెన్స్ కలిగి ఉండాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నాగరాజు బూర శేఖర్ శ్రీనివాస చారి గడ్డం ఎంకన్న శంకరాచారి సర్దార్ పంతంగి సాలయ్య ఆలగడప లక్ష్మయ్య యుగేందర్ చిరంజీవి శ్యామ్ నేమానందం సైదులు లింగరాజు తదితరులు పాల్గొన్నారు.