సీఎం కప్పు రాష్ట్ర స్థాయి అథ్లెటిక్స్ కు ఎంపిక విద్యార్థిని మేడి అనూష

Dec 20, 2024 - 19:57
Dec 20, 2024 - 20:19
 0  9
సీఎం కప్పు రాష్ట్ర   స్థాయి అథ్లెటిక్స్ కు ఎంపిక  విద్యార్థిని మేడి అనూష

తెలంగాణ వార్త ఆత్మకూరు యస్:- సీఎం కప్పు రాష్ట్ర స్థాయి అథ్లెటిక్స్ కు ఎంపిక విద్యార్థిని మేడి అనూష ఆత్మకూరు ఎస్.. సూర్యాపేట జిల్లా సాయి సీఎం కప్పు జూనియర్స్ అథ్లెటిక్స్ 100 మీటర్స్ పరుగు పందెంలో లాంగ్ జంప్ లలో మొదటి బహుమతి అందుకున్నారు ఆత్మకూరు ఎస్ మండలానికి చెందిన మేడి అనూష మొదటి స్థానంలో ఎంపికయింది. శుక్రవారం సూర్యాపేట జిల్లా ఎస్వీ డిగ్రీ కళాశాలలో జరిగిన సీఎం కప్ జూనియర్ అండర్ 16 బాలికల అథ్లెటిక్ ఛాంపియన్షిప్ లో 100 మీటర్స్ పరుగు పందెంలో లాంగ్ జంప్ లలో అనుష విజయం సాధించింది. ఆత్మకూరు మండల కేంద్రానికి చెందిన మేడి నాగయ్య కుమార్తె అనూష హైదరాబాద్ స్పోర్ట్స్ స్కూల్లో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతుంది. జిల్లా స్థాయి సీఎం కప్పు జూనియర్ అథ్లెటిక్ ఛాంపియన్షిప్ లో పాల్గొని 100 మీటర్స్ పరుగు పందెంలో లాంగ్ జంపులో మొదటి బహుమతి అందుకుంది . అనూష ఎంపిక పట్ల పలువురు అభినదించారు. తెలంగాణ రాష్ట్ర స్థాయి సీఎం కప్పు హనుమకొండలో 31,1,2, తేదీలలో ఆడనున్నారు