బిఆర్ఎస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశానికి ముఖ్య అతిథిగా
మాజీ ఎమ్మెల్యేలు మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి
అడ్డగూడూరు 30 జూలై 2025 తెలంగాణవార్త రిపోర్టర్:–
రానున్న స్థానిక సంస్థల ఎన్నికలపై యాదాద్రి భువనగిరి జిల్లా తుంగతుర్తి నియోజకవర్గంలోని మోత్కూరు మండల పరిధిలోని పాటిమట్ల ఎక్స్ రోడ్డులోని లక్ష్మి నరసింహ స్వామి ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన మోత్కూరు,అడ్డగూడూరు మండలాల బీఆర్ఎస్ పార్టీ విస్తృత సమావేశం నిర్వహించారు.హాజరై,కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించి,మోత్కూరు పట్టణానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎండీ అమీర్,మహేశ్వరం హనుమంతు,వెంకట్ తో పాటు పలువురు నాయకులను గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించిన మాజీ మంత్రి, ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీష్ రెడ్డి,తుంగతుర్తి మాజీ శాసనసభ్యులు డా"గాదరి కిశోర్ కుమార్,మాజీ ఎమ్మెల్యే బూడిద భీక్షమయ్య గౌడ్,మాజీ ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్,జిల్లా పార్టీ అధ్యక్షుడు కంచర్ల రామకృష్ణ రెడ్డి,రాష్ట్ర నాయకులు ఒంటెద్దు నర్సింహ రెడ్డి, నేవూరి ధర్మేందర్ రెడ్డి,మదర్ డైరీ డైరెక్టర్ రచ్చ లక్ష్మీ నర్సింహరెడ్డి మరియు మాజీ మార్కెట్ చైర్మన్లు,మాజీ ఎంపీపీలు,మాజీ జెడ్పీటీసీలు, మోత్కూరు,అడ్డగూడూరు మండలాల అధ్యక్షులు,మాజీ సర్పంచ్ లు,మాజీ ఎంపీటీసీలు,గ్రామశాఖ అధ్యక్షులు,నాయకులు, కార్యకర్తలు,మహిళలు తదితరులు పాల్గొన్నారు.