యశోద హాస్పిటల్ హైటెక్ సిటీలో క్యాన్సర్ కు అరుదైన చికిత్స
ఖమ్మం : హైదరాబాద్ హైటెక్ సిటీ లోని యశోద హాస్పిటల్ లో క్యాన్సర్ కు అరుదైన చికిత్స చేసినట్లు ప్రముఖ క్యాన్సర్ స్పెషలిస్ట్ , రోబోటిక్ సర్జన్ డాక్టర్ రాజేష్ గౌడ్ పేర్కొన్నారు . ఖమ్మం లోని ప్రెస్ క్లబ్ లో బుధవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఏడాది బాబుకు చేసిన అరుదైన చికిత్స గురించి వివరించారు . ఖమ్మం జిల్లా కారేపల్లి మండలం భాగ్యనగర్ తండాకు చెందిన షేక్ అబ్దుల్ ఇషాక్ అనే ఏడాది బాబుకి కడుపు నొప్పి, బరువు పెరగకపోవడం , విరేచనం కాకపోవడం వంటి సమస్యలతో ఇబ్బంది పడుతుండడంతో అతని తల్లిదండ్రులు పలు హాస్పిటళ్లకు తిరిగి చివరకు తమ వద్దకు వచ్చారన్నారు . బాబుకు పరీక్షలు నిర్వహించగా కడుపులో 2.5 కేజీల కణితి ఉన్నట్లు గుర్తించామన్నారు. దీనితో బయాప్సి చేయగా క్యాన్సర్ అని తేలిందిన్నారు . కాంప్ర హెన్సివ్ క్యాన్సర్ కేర్ విత్ పర్సనలైజ్డ్ ట్రీట్మెంట్ లో భాగంగా కీమో థెరపీ చేసి కణితి ని కరిగించి అడ్వాన్స్డ్ టెక్నాలజీ సహాయంతో బ్లాడర్ వాల్ తో కణితి ని రిమూవ్ చేసినట్లు తెలిపారు . అదే విధంగా యూరిన్ , మోషన్ కెళ్లే నరాలను ప్రిజర్వ్ చేసి సర్జరీ చేయడంతో రోగి కొలుకున్నట్లు తెలిపారు . రెండు రోజుల్లో నే డిస్సార్జి చేశామన్నారు. ఇప్పుడు బాబు నార్మల్ గానే యూరిన్ కెళ్తున్నాడని , ఇబ్బంది లేదని తెలిపారు. ఎటువంటి క్యాన్సర్ కైనా యశోద హాస్పిటల్ హైటెక్ సిటీ బ్రాంచ్ లో వైద్యం అందుబాటులో ఉందని తెలిపారు . ముందుగా నే క్యాన్సర్ ను గుర్తించడం ద్వారా అడ్వాన్స్ టెక్నాలజీ వైద్యం ద్వారా తగ్గించవచ్చని తెలిపారు . ఉన్నతమైన వైద్యం ఇప్పుడు తమ హాస్పిటల్ లో అందుతోందన్నారు . ఈ సమావేశంలో రోగి తల్లిదండ్రులు పాల్గొన్నారు .