ఐజా మండల కేంద్రంలో శ్రీకృష్ణవేణి ప్రైవేట్ స్కూల్స్ బస్సులపైన ప్రత్యేక తనిఖీలు చేపట్టిన జోగులాంబ జిల్లా ఆర్టిఏ అధికారులు
జోగులాంబ గద్వాల 31 జూలై 2025 తెలంగాణ వార్త ప్రతినిధి : గద్వాల జిల్లా గత కొన్ని రోజులుగా గద్వాల జిల్లాలో ఆర్టిఏ అధికారులు సుడిగాలి పర్యటన చేస్తూ, ప్రవేట్ స్కూల్ బస్సులను ఆపి తనిఖీలు చేస్తున్నారు. నిబంధనలు ఉల్లంఘించిన బస్సులను సీజ్ చేస్తున్నారు ఆర్టీఏ అధికారులు. స్కూల్ బస్సులు కండిషన్ లేకున్నా, ఫిట్నెస్ లేకుండా మరియు పర్మిషన్ లేకున్నా డ్రైవర్లకు డ్రైవింగ్ లైసెన్స్ లేకున్నా రోడ్లపైకి అట్టి వాహనాలు వస్తే అలాగే స్కూల్ బస్ డ్రైవర్లు ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేస్తే ఉపేక్షించేదే లేదన్నారు .గద్వాల జిల్లా ఆర్టిఏ అధికారులు.
అందులో భాగంగానే అల్లంపూర్ నియోజకవర్గం, ఐజా మండల కేంద్రంలో శ్రీ కృష్ణవేణి ప్రైవేట్ స్కూల్ బస్సులను తనిఖీలలో భాగంగా బస్సుల యొక్క ఫిట్నెస్, పర్మిషన్ డ్రైవర్లకు సంబంధించిన లైసెన్సులను క్షుణ్ణంగా పరిశీలించినట్లు ఆర్టిఏ అధికారులు రాములు ఈ సందర్భంగా తెలిపారు.