బాల కిష్టయ్య మృతి చిన్నంబావి మండలానికి తీరని లోటు
బాలకిష్టయ్య మృతి చిన్నంబావికి తీరని లోటు విషాదాన్ని చైతన్యంగా మలుచుకుందాం – నేతల పిలుపు
తెలంగాణ వార్త ప్రతినిధి చిన్నంబావి మండలం.
చిన్నంబావి మండల పరిధిలోని వెల్లటూరు గ్రామంలో ఇటీవల మరణించిన వీపనగండ్ల ఉమ్మడి మండలం మాజీ జెడ్పిటిసి బాల కిష్టయ్య పరామర్శించిన నేతలు
మనిషి మరణం ఇతరులకు విషాదము కాకూడదు అని మరణం ప్రేరణత్మకత ఆత్మ ప్రబోధత కావాలని సెర్వోస్ వ్యవస్థాపక అధ్యక్షులు మాజీ ఐపీఎస్ అధికారి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ప్రజలకు పిలుపునిచ్చారు.
కొల్లాపూర్ అసెంబ్లీ నియోజకవర్గము చిన్నంబావి మండలం లోని వెల టూర్ గ్రామ నివాసి మాజీ జెడ్పిటిసి సభ్యులు పరమాల బాలకృష్ణయ్య మృతి సందర్భం గా శుక్రవారం రోజు వెల్టూరు లోని బాలకృష్ణయ్య కుటుంబ సభ్యులను ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కొల్లాపూర్ మాజీ శాసనసభ్యులు బీరం హర్షవర్ధన్ రెడ్డి చిన్నంబావి మండల మాజీ ఎంపీపీ సోమేశ్వరమ్మ, మాజీ జెడ్పిటిసి వెంకట్ రావమ్మ చిన్నంబావి మాజీ సర్పంచ్ రంజిత్, రఘునందన్ రెడ్డి తదితరులు శుక్రవారం కలిసి పలకరింపు చేశారు.
ఈ సందర్భం గా బాలకృష్ణయ్య సంస్మరణ కార్యక్రమం లో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ ఒకరి మరణం కొందరికి విషాదం కలిగించిన అట్టి విషాద సంఘటనలు మళ్ళీ ఇంకొకరికి జరగకుండా చూసుకోవాలి తప్ప చనిపోయిన వారి కుటుంబం విషాదం లో ఉండగా కొంతమంది వ్యక్తులు ఆ విషాద సంఘటనల రోజు కూడా మద్యం తాగుతూ జల్సాలు చేసుకోవడం సభ్య సమాజం తిరోగమన దిశలో ప్రయాణిస్తుండ డానికి నిదర్శనమని ఆయన అన్నారు.
ఎవరైనా మరణిస్తే అట్టి మరణం ఏ పరిస్థితులలో జరిగినది అట్టి పరిస్థితులు అనారోగ్య సమస్యలు ఇతరులకు రాకుండా తగిన చర్యలు తీసుకునే విధం గా ప్రతి ఒక్కరు జాగ్రత్త పడాలి తప్ప ఇలా చనిపోయిన సంఘటనలను జలసాలుగా చేసుకుంటూ మద్యం సేవిస్తూ వారు కూడా మరణాలకు దారితీసే పరిస్థితులను కొని తెచ్చుకోవద్దని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ప్రజలకు మద్యం మత్తు పానీయాల సేవనకు దూరం గా ఉండాలని గుర్తు చేశారు.
అక్షరం ఆర్థికం ఆరోగ్యం ఆత్మగౌరవం అనే నినాదాలతో సర్వ సంస్థను స్థాపించడం జరిగిందని తెలంగాణలో పుట్టి పెరిగిన సర్వో సంస్థ దేశ విదేశాలలోనూ శాఖలుగా వేలూరుతున్నదని సర్వోస్ అంటే సమాజ శ్రేయస్సు కొరకు సమాజం లోని అసమానతలను మూఢనమ్మకాలను పారదోలెందుకే ప్రజలను చైతన్యము చేసి వారికి విద్య వైద్యం ఆరోగ్యమందే విధంగా కృషి చేయడానికి సర్వ సంస్థ పాటుపడుతుందని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ప్రజలకు తెలియజేశారు.
కొల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ పరమాల బాలకృష్ణయ్య తనకు అత్యంత ఆత్మీయుడని రాజకీయం గా తనకి ఎంతో చేరువయ్యారని అలాంటి వ్యక్తి మరణం చిన్నంబావి మండల ప్రజలకు తీరని లోటు అని ఆయన అన్నారు.
బాలకృష్ణయ్య కుటుంబ సభ్యులకు బి ఆర్ ఎస్ పార్టీ తరఫున ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ వారి కుటుంబానికి ఎల్లవేళలా అందుబాటులో ఉంటానని ఆయన మృతిని కుటుంబ సభ్యులకు భరోసాను కల్పించారు.
వెల్లటూరు గ్రామ మాజీ సర్పంచ్ పురంధర్ రెడ్డి మాట్లాడుతూ సర్వో సంస్థను స్థాపించి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ప్రజలను, యువతను సన్మార్గం లో నడిపిస్తున్నారని , అందరికీ ఆప్తుడు బాలకృష్ణయ్య మృతికి సంతాపం తెలుపుతూ వారి కుటుంబాన్ని పలకరింపు కు వచ్చిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, కొల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి తదితరులకు ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.
వెల టూర్ లో మృతుడు పరమాల బాలకృష్ణయ్య కుటుంబాన్ని పలకరింపుకు వచ్చిన సర్వోస్ అధినేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కొల్లాపూర్ మాజీ శాసనసభ్యులు బీరం హర్షవర్ధన్ రెడ్డి తదితరులకు చిన్నంబావి మండల కేంద్రంలో చిన్నంబావి మండల మాజీ సర్పంచ్ రంజిత్ సెర్వోస్ రాష్ట్ర డైరెక్టర్ తరంగి బ్రహ్మయ్య మద్దిలేటి స్వామి సంపంగి మల్లేష్ మధు వంశీ తదితరులు స్వాగతం పలికారు.
అనంతరం చిన్నంబావి మండల కేంద్రం లోని చిన్నంబావి మండలం మాజీ ఎంపీపీ సోమేశ్వరమ్మ ఇంటికి వెళ్లిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ హర్షవర్ధన్ రెడ్డిలు అక్కడ తేనీరు సేవించారు.
అనంతరం చిన్నంబావి మండల పోలీస్ ఎస్ఐ నాగరాజు లక్ష్మి పల్లి గ్రామ ప్రజలను, బి ఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అంటూ వారిపై తప్పుడు కేసులు బనాయిస్తూ వేధిస్తున్నారని ఆ ఊరి ప్రజలు మాజీ ఐపీఎస్ అధికారి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, కొల్లాపూర్ మాజీ శాసనసభ్యులు హర్షవర్ధన్ రెడ్డి ల దృష్టికి తీసుకురాగా వారు లక్షింపల్లి చిన్నంబావి మండల ప్రజలతో కలిసి చిన్నంబావి మండల కేంద్రం లోని పోలీస్ స్టేషన్కు వెళ్లి అక్కడికి ఎస్సై నాగరాజు తో అక్రమ కేసుల బనాయపు గురించి చర్చించారు.
అవి అక్రమ కేసులు కాదని జెన్యూన్ గా వారిపై ఆరోపణలు ఉన్నందునే కేసులు నమోదు చేయడం జరిగిందని ఎస్ఐ నాగరాజు మాజీ ఐపీఎస్ అధికారి ప్రవీణ్ కుమార్ కు చెప్పగా అంతేలే మనం ఎక్కడ ఈ కాకి డ్రస్సు వేసుకున్న అధికారులకు ఉన్నదే అది కదా అంటూ అమాయకులను వేధించొద్దని అక్రమ కేసులు బనాయించవద్దు అని చిన్నంబావి మండల పోలీస్ ఎస్ఐ నాగరాజు సూచిస్తూ అక్కడి నుంచి వారు తిరిగి వెళ్లిపోయారు.
ఇందులో చిన్నంబావి మండల మాజీ ఎంపీటీసీ సోమేశ్వరమ్మ, మాజీ జెడ్పిటిసి వెంకట రమణమ్మ చిన్నారెడ్డి,పరిసర ప్రాంతాలలో ఉండే బి ఆర్ఎస్ నూతన సర్పంచులు, మాజీ సర్పంచులు, పార్టీ మండల పెద్దలు, పార్టీ శ్రేణులు,అధిక సంఖ్యలో పాల్గొన్నారు.