ఉపాధ్యాయ వృత్తి జీవితంలో ...పదవీ విరమణ వారి సేవలకు గుర్తింపు....

Jun 28, 2024 - 20:26
 0  144
ఉపాధ్యాయ వృత్తి జీవితంలో ...పదవీ విరమణ వారి సేవలకు గుర్తింపు....

- జెడ్పి చైర్ పర్సన్, కాంగ్రెస్ పార్టీ గద్వాల ఇంచార్జీ సరితమ్మ....

జోగులాంబ గద్వాల 28 జూన్ 2024 తెలంగాణవార్త ప్రతినిధి:- పదవీ విరమణ అనేది ఒక వ్యక్తి జీవితంలో ఒక ప్రధాన అంశం,ఇది వారి కెరీర్ ముగింపును సూచిస్తుందని జెడ్పి చైర్ పర్సన్, కాంగ్రెస్ పార్టీ గద్వాల నియోజకవర్గ ఇంచార్జీ సరితమ్మ అన్నారు...ఇటిక్యాల మండలం ధర్మవరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మండల విద్యాశాఖ అధికారిగా ఇ.రాజు సేవలు అందించి పదవీ విరమణ కార్యక్రమంలో జెడ్పి చైర్ పర్సన్, కాంగ్రెస్ పార్టీ గద్వాల ఇంచార్జీ సరితమ్మ.. అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు ముఖ్య అతిధులుగా పాల్గొన్నారు..

  అనంతరం సరితమ్మ మాట్లాడుతూ.... నిర్దిష్ట ఉద్యోగ వృత్తికి చేసిన సేవకు వ్యక్తిని గౌరవించడం మరియు కృతజ్ఞతలు తెలియజేయడం కోసం, పదవీ విరమణ ఫంక్షన్ సాధారణంగా నిర్వహించబడుతుందని,వేడుకలో భాగంగా,ఆ వ్యక్తి అన్ని సంవత్సరాల్లో ప్రదర్శించిన ప్రశంసనీయమైన వృత్తిపరమైన పనితీరును గుర్తిస్తూ.దీంతో ఇతరులను మరింత ప్రోత్సహించడానికి మరియు వారు పని చేస్తున్న వృత్తికి లేదా ఉద్యోగానికి యొక్క అభివృద్ధికి కృషి చేయడానికి కూడా ఒక ప్రయత్నంగా వారి సేవలు అందించాలని సరితమ్మ అన్నారు...

ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయు,కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎల్లప్ప, నాగేంద్ర యాదవ్, కొత్త గణేష్, సమి,కుమారి నారాయణ తదితరులు ఉన్నారు...

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333