బాధిత కుటుంబాన్ని బీఆర్ఎస్ నాయకులు పరామర్శ

అడ్డగూడూరు20 జనవరి 2025 తెలంగాణవార్త రిపోర్టర్:- యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు మండల పరిధిలోని చిర్రగూడూరు గ్రామంలో గత కొన్ని రోజుల క్రితం హఠాత్తుగా మరణించిన గ్రామపంచాయతీ సిబ్బంది పులిమామిడి అంజయ్య చిత్రపటానికి నివాళులర్పించి వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేసి బిఆర్ఎస్ పార్టీ తరపున ఆర్థిక సహాయం అందజేసిన.శ్రీరాముల జ్యోతి అయోధ్య మాజీ జడ్పీటీసీ, ఖమ్మంపాటి పరమేశ్ సర్పంచ్ మాజీ ఎంపీపీ దర్శనాల అంజయ్య,బిఆర్ఎస్ పార్టీ మండల ప్రధానకార్యదర్శి చేగొని సోమయ్య,ఖమ్మంపాటి సోమయ్య, చేగోని రాంబాబు ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు శ్రీరాముల నర్సింహ శీల సత్తయ్య, మాజీ వార్డు మెంబర్ ఖమ్మంపాటి సోమసాయిలు బిఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.