18 సంవత్సరాల లోపు ఉన్న పిల్లలకు. వాహనాలు ఇవ్వరాదు
సిఐ శ్రీనివాస్ నాయక్ వెల్లడి

తుంగతుర్తి జనవరి 20 తెలంగాణవార్త ప్రతినిధి:- తుంగతుర్తి మండల పరిధిలోనే పలు గ్రామాల ప్రజలకు తెలియజేయునది ఏమనగా నీ పిల్లలకు వాహనాలు ఇచ్చేముందు 18 సంవత్సరాలు దాటిన వారికి మాత్రమే వాహనాలు ఇవ్వగలరు లేనియెడల చట్టరీత్యా చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు ప్రతి ఒక్క వాహనదారుడు హెల్మెట్ ధరించాలి తుంగతుర్తి సర్కిల్ సీఐ.. శ్రీనివాస్ నాయక్ పత్రికా సమావేశంలో మాట్లాడుతూ ప్రతి విద్యార్థి కూడా వాహనాలు నడిపే ముందు పలు జాగ్రత్తలు తీసుకొని ప్రభుత్వం నిర్ణయించిన చట్టానికి అనుకూలంగా డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉన్న వారు మాత్రమే వాహనాలు నడపాలని లేనియెడల చెట్ట రీత్యా చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎస్సై క్రాంతి కుమార్. పలువురు పోలీసులు. గ్రామ ప్రజలు పలు గ్రామాల విద్యార్థులు పుర ప్రముఖులు పాల్గొన్నారు