జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఏపూరులో 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు

Aug 15, 2025 - 18:20
Aug 15, 2025 - 19:07
 0  79
జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఏపూరులో 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు

తెలంగాణ వార్త ఆత్మకూరు ఎస్   జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఏపూరులో 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా పాఠశాలలో జరిగిన వేడుకలు పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఎండి బాసిత్ గారి అధ్యక్షతన కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో విద్యార్థుల యొక్క నృత్య ప్రదర్శనలు, కోలాటాలు, స్టూడెంట్ పోలీస్ ప్రదర్శనలు ఆద్యంతం ఆకట్టుకున్నాయి అలాగే గత సంవత్సరం పదో తరగతిలో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులకు ప్రోత్సాహక బహుమతులు అందజేయడం జరిగింది దీనికిగాను రిటైర్డ్ ఉపాధ్యాయులు జానీమియా గారు ప్రథమ బహుమతి సాధించిన విద్యార్థినికి ఆరు వేల రూపాయలు రెండవ బహుమతి సాధించిన విద్యార్థినికి నాలుగు వేల రూపాయలు మూడవ స్థానం సంపాదించిన విద్యార్థికి మూడు వేల రూపాయల నగదు బహుమతి ఇవ్వడం జరిగింది అలాగే ఏపూర్ గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బుడిగే లింగయ్య గారు ప్రథమ స్థానం సాధించిన విద్యార్థికి ఐదు వేల నూట పదహారు రూపాయలు రెండవ స్థానం సాధించినన విద్యార్థికి మూడువేల నూట పదహారు రూపాయలు మూడవ స్థానం పొందిన విద్యార్థికి 2016 ఇచ్చి ప్రోత్సహించడం జరిగింది అలాగే ఏపూరు స్పెషల్ ఆఫీసర్ ఎంపిడిఓ హసీం అలీ గారు ఈ సంవత్సరం పదవ తరగతి చదువుతున్నటువంటి విద్యార్థులకు స్టడీ చైర్స్ ప్లాంక్స్ ఇస్తానని ప్రకటించడం జరిగింది. పిల్లల అద్భుత నృత్య ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో గ్రామస్తులతో పాటు పాఠశాల ఉపాధ్యాయ బృందం రమణ వేణు పుష్పకుమారి పబ్బ తి వెంకటేశ్వర్లు విజయ నాగేందర్ వెంకటేష్ చెరుకు శ్రీను విజయ్ కుమార్ రవి మోహన్ శాస్త్రి నవీన్ పద్మ మొదలైన వారు పాల్గొన్నారు