పరీక్ష కేంద్రాలను తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్
జోగులాంబ గద్వాల 2 మార్చి 2024 తెలంగాణ వార్త ప్రతినిధి:- గద్వాల . ప్రశాంత వాతావరణంలో ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలను నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ బి. యం. సంతోష్ తెలిపారు. శనివారం గద్వాల ప్రభుత్వ జూనియర్ కళాశాలలో పరీక్షా కేంద్రాన్ని ఆయన తనిఖీ చేసారు. కేంద్రంలో సీసీ కెమెరాలు, వసతులు, పరీక్షా నిర్వహణ తీరును ఆరా తీశారు. ఈ సందర్బంగా పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు చేస్తున్నామని, ప్రశాంత వాతావరణంలో పరీక్షలు నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ కు అధికారులు వివరించారు. విద్యార్థులు మాస్ కాపీయింగ్ కు పాల్పడకుండా ఇన్విజిలేటర్లు కఠినంగా వ్యవహరించాలని కలెక్టర్ ఆదేశించారు. పరీక్ష కేంద్రంలోకి విద్యార్థులు సెల్ ఫోన్లు తీసుకురాకుండా చర్యలు చేపట్టడం జరుగుతుందన్నారు. పరీక్షా కేంద్రంలో మొత్తం 369 మంది విద్యార్థినీ విద్యార్థులు పరీక్షకు హాజరు కావాల్సి ఉండగా, 12 మంది విద్యార్థులు గైర్హాజరైనట్లు సంబంధిత అధికారులు కలెక్టర్ కు తెలియజేశారు. జిల్లా ఇంటర్మీడియట్ విద్యాశాఖ అధికారి హృదయ్ రాజ్, కళాశాల ప్రిన్సిపల్, చీఫ్ ఎగ్జామినర్ తదితరులు ఉన్నారు.