ప్రైవేట్ విద్యాసంస్థలలో అధిక ఫీజులు వసూలు నిషేధించాలి

ఫీజు బకాయిలు ఇవ్వకపోతే ప్రభుత్వంపై తిరుగుబాటే
విద్యార్థులకు స్కూటీలు ల్యాప్టాప్ లు ఇంకెప్పుడు ఇస్తారు?
ఏఐఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఉప్పుల శాంతి కుమార్
మోత్కూర్ 21 జూన్ 2025 తెలంగాణవార్త రిపోర్టర్:– జిల్లాలో అధిక ఫీజులు వసూలు చేస్తున్న ప్రైవేట్ విద్యాసంస్థలను నిషేధించాలని,ఫీజుల నియంత్రణ చట్టాన్ని అమలు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం భయపడుతుందని,ప్రైవేట్ విద్యాసంస్థలు చేస్తున్న ఫీజుల దోపిడీకి రాష్ట్ర ప్రభుత్వం విద్యాశాఖ వత్తాసు పలుకుతున్నాయని,ప్రభుత్వ గురుకులాలు,బెస్ట్ అవలేబుల్ స్కీమ్ పాఠశాలలు మూతపడుతున్న ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుందని,పెండింగ్ లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్ స్కాలర్షిప్ బకాయిలను విడుదల చేయకపోతే స్థానిక సంస్థల ఎన్నికల్లో విద్యార్థులు ప్రభుత్వంకి విద్యార్థుల సత్తా ఏంటో చూపిస్తారని,ప్రభుత్వంపై తిరుగుబాటు చేస్తారని, విద్యార్థులకు 5లక్షల భరోసా కార్డు,ఎలక్ట్రిక్ స్కూటీలు, ల్యాప్టాప్ లు ఇంకెప్పుడు ఇస్తారని,ఆర్టీసీలో విద్యార్థులకు ఉచిత రవాణా సౌకర్యం కల్పించాలని ఏఐఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఉప్పుల శాంతి కుమార్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.శుక్రవారం రోజు యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరులో ఏఐఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి మాట్లాడుతూ..జిల్లాలో ముఖ్యంగా మోత్కూరు మండల కేంద్రంలో ప్రైవేట్ విద్యాసంస్థలు విద్యను వ్యాపారంగా మార్చి అక్షరాలతో లక్షల రూపాయల వ్యాపారం చేస్తున్నారని,ప్రభుత్వం అధిక ఫీజులను నియంత్రించకుండా ప్రైవేట్ విద్యాసంస్థలకు వత్తాసుగా వ్యవహరిస్తుందని,అధిక ఫీజులు వసూలు చేస్తే సీజ్ చేయాలని ఆ దమ్ము ధైర్యం విద్యాశాఖ అధికారులకు లేదని,రాష్ట్ర విద్యాశాఖ నిబంధనలకు విరుద్ధంగా 1రూపాయి ఎక్కువ ఫీజు వసూలు చేస్తే ఆ విద్యాసంస్థను నిషేధించాలని, రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థుల ఆర్టీసీ బస్ పాస్ చార్జీలను పెంచడం సరికాదని విద్యార్థులకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత రవాణా సౌకర్యం కల్పించాలని,రాష్ట్రంలో విద్యా సంవత్సరం ప్రారంభం అయిన నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి విద్యారంగంపై సమీక్ష చేసి ప్రభుత్వ విద్యాలయాల్లో నెలకొన్న సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని విద్యారంగం గాడి తప్పిందని ప్రభుత్వ విద్యాసంస్థల్లో సరైన సౌకర్యాలు లేవని,ప్రభుత్వ గురుకులాలకు బెస్ట్ అవైలబుల్ పాఠశాలలకు బిల్లులు చెల్లించక అందులో చదివే విద్యార్థులు ఇంటి వద్ద ఉండే పరిస్థితి ఉందని,పాఠశాల కళాశాలలో టీచింగ్,నాన్ టీచింగ్ సిబ్బంది పోస్టులు ఖాళీగా ఉన్నాయని,గురుకులాలు మోడల్ స్కూల్లో కేజీబీవీలలో నాణ్యమైన ఆహారం అందించేందుకు కృషి చేయాలని, విద్యార్థులు లేరని సాకుతో ప్రభుత్వం12ఎస్సి గురుకుల ఇంటర్ కళాశాలలను మూసివేసే నిర్ణయాన్ని మార్చుకోవాలని, రాష్ట్రంలో ప్రైవేట్,కార్పొరేట్ విద్యా సంస్థలు అధిక ఫీజులు వసూలు చేస్తే ఆపాఠశాల,కళాశాలల గుర్తింపు రద్దు చేసే విధంగా కఠిన చట్టం తేవాలని,ప్రతి ప్రైవేట్ విద్యాసంస్థ నిబంధనలు పాటించాలని లేని పక్షంలో ఆ విద్యాసంస్థల ముందు ధర్నాలు చేస్తామని,రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం పెండింగ్ లో ఉన్నఫీజురీయింబర్స్మెంట్,స్కాలర్షిప్ బకాయిల విడుదల పై ఇచ్చిన మాట తప్పుతున్నారని, విద్యార్థులకు ఓట్లు లేకపోతే వారి తల్లిదండ్రులకు ఉన్నాయని వారు అప్పులు చేసి ఫీజులు కట్టి సర్టిఫికెట్ తీసుకున్నారని వెంటనే ఫీజు బకాయిలు విడుదల చేయకపోతే స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రభుత్వంపై తిరుగుబాటు తప్పదని,అన్ని రకాల బకాయిలను విడుదల చేస్తున్న ప్రభుత్వం విద్యార్థుల చదువులకు నిధులు విడుదల చేయకుండా జాప్యం చేయడం సరికాదని,వెంటనే ప్రభుత్వం ఫీజు బకాయిలను విడుదల చేయాలని సీఎం రేవంత్ రెడ్డి తన వద్ద విద్యాశాఖ పెట్టుకున్న నేపథ్యంలో అన్ని విద్యారంగ సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని ఇంజనీరింగ్ కళాశాలలో ఫీజులను ఎట్టి పరిస్థితిలో ప్రభుత్వం పెంచవద్దని బి కేటగిరి సీట్లను లక్షల రూపాయలకు అమ్ముతున్న కళాశాలలను బ్లాక్ లిస్టులో పెట్టాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో ఏ ఐ వై ఎఫ్ జిల్లా ఉపాధ్యక్షులు శేఖర్ రెడ్డి ఏఐఎస్ఎఫ్ జిల్లా నాయకులు వంశి భాస్కర్ మండల కార్యదర్శి రాంపాక చందు అనిల్,కర్ణాకర్ తదితరులు పాల్గొన్నారు.