ప్రపంచ శాంతి కోసం నిరంతర పోరాటాలు. సిపిఐ -సిపిఎం 

Oct 7, 2024 - 17:32
 0  3
ప్రపంచ శాంతి కోసం నిరంతర పోరాటాలు. సిపిఐ -సిపిఎం 

జోగులాంబ గద్వాల 7 అక్టోబర్ 2024 తెలంగాణ వార్తా ప్రతినిధి:- గద్వాల సామ్రాజ వాదానికి వ్యతిరేకంగా ప్రపంచ శాంతి కోసం వామపక్ష పార్టీలుగా నిరంతరం పోరాటాలు చేస్తామని సిపిఎం సిపిఐ జిల్లా కార్యదర్శులు ఏ.వెంకటస్వామి బి.ఆంజనేయులు అన్నారు  వామక్ష పార్టీల అఖిల భారత కమిటీల పిలుపు మేరకు సోమవారం స్థానిక పాత బస్టాండ్ లోని వైయస్సార్ చౌరస్తాలో వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు. 
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గాజా పై ఇజ్రాయిల్ దాడి చేసి నేటికి సంవత్సరం పూర్తి కావోస్తున్నప్పటికి  సంప్రదింపుల ద్వారా శాంతి కోసం అంతర్జాతీయ సమాజం చేస్తున్న ప్రయత్నాలను అమెరికా నేతృత్వంలోని  సామ్రాజ్యవాద దేశాలు వమ్ము చేస్తున్నాయని విమర్శించారు  ఇజ్రాయిల్ యుద్ధ కాంక్షతో నిరంతరం ఇరాన్ పాలస్తీనా ఏమేన్ లేబనాన్ వంటి దేశాలపై నిరంతర దాడులకు పాల్పడుతూ అంతర్జాతీయ ఉద్రిక్తతలకు కారణమవుతుందని విమర్శించారు అమెరికా ఫ్రాన్స్ జపాన్ జర్మనీ వంటి దేశాలు తెరవెనక ఉండి ప్రచ్ఛన్న ప్రత్యక్ష  యుద్ధానికి కారణమవుతూ ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక రాజకీయ సంక్షోభాలకు  కారణమవుతున్నాయని విమర్శించారు ప్రపంచంలో  చమురు సహజ వనరులు ఉన్న దేశాలను తన అధీనంలోకి తెచ్చుకోవడం కోసం సామ్రాజవాదాల దేశాలు తృతీయ ప్రత్యామ్నాయ దేశాలు పేద దేశాలపై నిరంతర  దాడులకు  పాల్పడుతున్నాయని విమర్శించారు ఇప్పటికే పాలస్తీనాలో ఇజ్రాయిల్ యుద్ధ కాంక్ష వల్ల సుమారు 8 శాతం జనాభా మరణించిందని లక్షలాది మంది పౌరులు ఆశ్రయం కోల్పోయారని కొందరు వికలాంగులుగా మారారని  పర్యావరణం పూర్తిగా దెబ్బతిన్నదని ఆవేదన వ్యక్తం చేశారు యుద్ధాల ద్వారా  ఆర్థిక సంక్షోభాలను సృష్టించి అమెరికా ప్రపంచాన్ని తన  ఆధీనంలోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నదని విమర్శించారు ప్రపంచ యుద్ధాల వల్ల భారతదేశంపై కూడా ప్రత్యక్ష పరోక్ష ప్రభావాలు పడుతున్నాయని దీని ప్రజలు గమనించాలని కోరారు ప్రస్తుతం దేశంలో పెరుగుతున్న పెట్రోల్ డీజిల్ నిత్యవసరల వస్తువుల  ధరలకు ఈ యుద్ధాలే కారణమని ప్రపంచ యుద్ధాల వల్ల ఆయా దేశాలలో పనిచేస్తున్న భారతీయులు ఉద్యోగ ఉపాధి  అవకాశాలు కోల్పోయి తిరిగి భారతదేశానికి వస్తే ఇక్కడ కూడా సంక్షోభాలు తలెతే అవకాశం ఉందని హెచ్చరించారు వామపక్ష పార్టీలుగా అంతర్జాతీయ దృక్పథంతో ప్రపంచ శాంతి కోసం నిరంతరం పోరాటాలు చేస్తున్న వామపక్ష పార్టీల ఉద్యమాలకు ప్రజలు కార్మికులు మేధావులు మద్దతునివ్వాలని కోరారు ఈ కార్యక్రమంలో సిపిఎం సీపీఐ నాయకులు పరంజ్యోతి వివి నరసింహ ఉప్పేర్ నరసింహ ఆశన్న, మస్తాన్ , వెంకట్రములు,రామకృష్ణ నరేష్ మజ్జిగ ఆంజనేయులు సత్య రాం సామేల్ విష్ణు నరేష్ రమేష్ సవారన్న తదితరులు పాల్గొన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333