సర్పంచుల పెండింగ్ బిల్లులు చెల్లించండి
హైదరాబాద్/బషీర్ బాగ్ : సర్పంచుల పెండింగ్బిల్లులను వెంటనే చెల్లించాలని తెలంగాణ సర్పంచుల సంఘం జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు సుర్వీ యాదయ్య గౌడ్ డిమాండ్చేశారు.
శుక్రవారం తెలంగాణ సర్పంచుల సంఘం జేఏసీ ఆధ్వర్యంలో హైదరాబాద్లోని పంచాయతీ రాజ్ కమిషనర్ ఆఫీస్ ఎదుట సర్పంచులు నిరసన తెలిపారు. గేటు ముందు బైఠాయించి ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. అధికారుల ఆదేశాల మేరకు గ్రామాల్లో అభివృద్ధి పనులు చేపట్టామని, ఇప్పటి వరకు బిల్లులు రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వచ్చి 9నెలలు అవుతున్నా తమకు బిల్లులు చెల్లించకపోవడం దారుణమన్నారు.