ప్రతి చిన్నారి భవిష్యత్తులో భాగస్వామ్యం కావాలి
తిరుమలగిరి 21 నవంబర్ 2025 తెలంగాణ వార్త రిపోర్టర్
తిరుమలగిరిమండలంలోని మామిడాల ఈదుల పర్రె తండా, మర్రికుంఠ తండా, గుండెపూరి, మాలిపురం గ్రామలలో బాల్య వివాహాల నిర్మూలనపై ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా అంగన్వాడి సూపర్వైజర్స్ కందుకూరి మంగా ఎండి కైరునిస మరియు బాలుర పరిరక్షణ విభాగం శోభారాణి పలువురు మాట్లాడుతూ గ్రామంలోని ప్రతి వర్గానికి బాల్య వివాహాల హానికారక ప్రభావాలు, చట్టపరమైన శిక్షలు, పిల్లల భవిష్యత్‌పై కలిగే ప్రభావాలను వివరించి అవగాహన కల్పించారు. చిన్నారుల విద్య, ఆరోగ్యం మరియు భద్రతను కాపాడటంలో సమాజం బాధ్యతను గుర్తుచేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న అందరితో కలిసి బాల్య వివాహాల నిర్మూలనపై ప్రత్యేక ప్రతిజ్ఞ చేయించటం జరిగింది. సమాజంలోని ప్రతి వ్యక్తి చిన్నారుల భవిష్యత్తు రక్షణలో భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. బాల్య వివాహాలను పూర్తిగా నిర్మూలించేందుకు గ్రామస్థుల సహకారం అత్యంత కీలకమని తెలిపారు. ఈ కార్యక్రమంలో సఖి సెంటర్ సుజాత , జిల్లా మహిళా సాధికారత కేద్రం _రేవతి, ఐ సి డి ఎస్ టీచర్స్,__అనిత, బూలి, స్వప్న ఏమిల్య్ పద్మ చంద్రకళ,ఐ సి డి ఎస్ సెక్టార్ స్కూల్ టీచర్స్ ఆశాలు ప్రభుత్వ ప్రతినిధులు సంబంధిత అధికారులు మరియు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు ...