ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను ప్రభుత్వం తక్షణమే చెల్లించాలని కోరుతూ ....

Oct 17, 2024 - 17:48
 0  4
ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను ప్రభుత్వం తక్షణమే చెల్లించాలని కోరుతూ ....

తెలంగాణ ప్రైవేట్ డిగ్రీ, పీజీ కళాశాల మేనేజ్మెంట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సూర్యాపేట జిల్లా కేంద్రంలో బైక్ ర్యాలీ నాలుగో రోజుకు చేరిన డిగ్రీ కళాశాలల బంద్  కలెక్టర్ కు వినతిపత్రం అందజేత

సూర్యాపేట ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను తక్షణమే చెల్లించాలని తెలంగాణ ప్రైవేట్ డిగ్రీ, పీజీ కళాశాలల మేనేజ్మెంట్ అసోసియేషన్ మహాత్మా గాంధీ యూనివర్సిటీ అనుబంధం జిల్లా జనరల్ సెక్రెటరీ సైదారావు, మహాత్మా గాంధీ యూనివర్సిటీ కమిటీ సభ్యులు తీకుల శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ప్రైవేట్ జూనియర్ వివిధ కళాశాలలో మూడేళ్లుగా పెండింగ్ లో ఉన్న ఫీజు రీఎంబర్స్మెంట్ బకాయిలను రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాలని కోరుతూ టీపీడీపీఎంఏ డిగ్రీ కళాశాల బంద్ కు పిలుపునివ్వడంతో కళాశాల బంద్ గురువారానికి నాలుగో రోజుకు చేరింది. టిపి డిపిఎంఏ మహాత్మా గాంధీ యూనివర్సిటీ అనుబంధం ఆధ్వర్యంలో సూర్యాపేట జిల్లా కేంద్రంలోని ఎన్టీఆర్ పార్క్ నుంచి సూర్యాపేట కలెక్టర్ కార్యాలయం వరకు బైక్  ర్యాలీ నిర్వహించి మాట్లాడారు. అనంతరం జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ కు వినతిపత్రం  అందజేశారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ గత మూడేళ్లుగా డిగ్రీ, జూనియర్  కళాశాలకు ఫీజు రీయింబర్స్మెంట్ విడుదల చేయకపోవడంతో యాజమాన్యాలు అధ్యాపకులు అనేక ఇబ్బందుల గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రైవేటు యజమాన్యాలు అద్దె చెల్లించలేని దుస్థితి దాపురించిందని, అధ్యాపకులకు వేతనాలు చెల్లించే పరిస్థితి లేదని వాపోయారు. అధ్యాపకులకు వేతనాలు చెల్లించడానికి కనీసం అప్పు చేసి  చెల్లిద్దామంటే ఎవరు ఇచ్చే పరిస్థితి లేదని వాపోయారు. ప్రతిసారి ఎన్నికల సమయంలో ప్రైవేట్ కళాశాలలను, అధ్యాపకులను ఆదుకుంటామని పాలక ప్రభుత్వాలు  ఇచ్చిన హామీలు నీటి మూటలు గానే మిగిలాయని ఆక్షేపించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం వీలైనంత త్వరలో పెండింగ్ లో ఉన్న 650 కోట్ల రూపాయల  రియంబర్స్మెంట్ ను విడుదల చేయాలని కోరారు.ఈ కార్యక్రమంలో శ్రీ సాయి త్రివేణి డిగ్రీ కళాశాల డైరెక్టర్ డి, అనిల్ కుమార్, ప్రిన్సిపాల్ తన్నీరు ఉపేందర్, ఆర్ కె ఎల్ కె డిగ్రీ కళాశాల కరస్పాండెంట్ త్యాగరాజు, గౌతమి డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ టి, నరేందర్, మహార్షి డిగ్రీ కళాశాల కరస్పాండెంట్ నారాయణ ప్రవీణ్ రెడ్డి , ప్రిన్సిపాల్ పి, నగేష్,వైస్ ప్రిన్సిపాల్ జి, రమాదేవి,ప్రతిభ జూనియర్ కళాశాల కరస్పాండెంట్ సత్యంబాబు, శ్రీనిధి కళాశాల కరస్పాండెంట్ యాదవ రెడ్డి,సాయి గౌతమి జూనియర్ కళాశాల కరస్పాండెంట్ భగవాన్ రెడ్డి, వివిధ కళాశాలల ప్రిన్సిపాల్ లు, అధ్యాపకులు, తదితరులు పాల్గొన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333