ప్రజాస్వామ్యంలో మీడియా ది కీలకపాత్ర ఎమ్మెల్యే మందుల సామెల్

తిరుమలగిరి 31 జూలై 2025 తెలంగాణ వార్త రిపోర్టర్:
ప్రజాస్వామ్య నిర్మాణంలో మీడియా నాలుగవ స్తంభంగా ఉండి తమ పాత్రను పోషించడం గొప్ప విషయమని,ప్రభుత్వానికి ప్రజలకు మధ్య విలేకరులు వారధిగా పనిచేస్తున్నారని తుంగతుర్తి శాసనసభ్యులు మందుల సామేల్ అన్నారు. ఆగస్టు 12వ తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో జరిగే తెలంగాణ మాదిగ జర్నలిస్టుల ఫోరం ఆధ్వర్యంలో నిర్వహించే రాష్ట్ర రెండవ మహాసభ కరపత్రాలను,వాల్ పోస్టర్ బుధవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే సామేల్ చేతుల మీదుగా ఆవిష్కరణ చేశారు.అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ...నిత్యం మెరుగైన సమాజం కోసం పరితపించే జర్నలిస్టుల నూతన దారులను వెతుకుతూ దేశ పురోగతిలో పాత్ర ఎంతో కీలకంగా ఉందన్నారు. తెలంగాణ మాదిగ జర్నలిస్టు ఫోరం జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి గీటు రాయిగా పోరాటాలు చేయడం హర్షించదగ్గ విషయమని అన్నారు.ఈ కార్యక్రమంలో నియోజకవర్గం మండలాల మాదిగ జర్నలిస్టులు,డిసిసిబి డైరెక్టర్ గుడిపాటి సైదులు, పీఎంజేఎఫ్ రాష్ట్ర కార్యదర్శి కడియం నాగయ్య, రాష్ట్ర నాయకులు చింత ప్రవీణ్,కొండగడుపుల లక్ష్మణ్,ఎల్లయ్య,వెంకన్న,జానీ ప్రసాద్,రాం కుమార్,కందుకూరి లక్ష్మయ్య,వంగాల దానియేల్,జుమ్మిలాల్ నాయక్,పత్తెపురం సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.... .