ఏ.ఐ.కె.ఎం.ఎస్ ఆధ్వర్యంలో "బ్లాక్ డే"మోడీ దిష్టిబొమ్మ దగ్ధం

Feb 23, 2024 - 18:08
 0  18
ఏ.ఐ.కె.ఎం.ఎస్  ఆధ్వర్యంలో "బ్లాక్ డే"మోడీ దిష్టిబొమ్మ దగ్ధం

తెలంగాణ వార్త ఆత్మకుర్ యస్  ప్రతినిధి ఏ.ఐ.కె.ఎం.ఎస్ ఆధ్వర్యంలో "బ్లాక్ డే" మోడీ దిష్టిబొమ్మ దగ్ధం అఖిల భారత రైతు- కూలీ సంఘం (AIKMS), ఆధ్వర్యంలో ఆత్మకూర్ మండల కేంద్రంలో *సంయుక్త కిసాన్ మోర్చా (SKM) ఇచ్చిన "బ్లాక్ డే"* పిలుపులో సందర్బంగా మోడీ దిష్టి బొమ్మ దగ్ధం చేశారు. ఈసందర్భంగా అఖిల భారత రైతు- కూలీ సంఘం (ఏ.ఐ.కె.ఎం.ఎస్) రాష్ట్ర సహాయ కార్యదర్శి మండారి డేవిడ్ కుమార్ మాట్లాడుతూ...దేశ సంపదను, సహజ వనరులను,ఆస్తులను ఆదానీ, అంబానీ లకు దోచిపెడుతున్న బీజేపీ మోడీ ప్రభుత్వం, ఆరుకాలం రెక్కలను ముక్కలు చేసి కష్టపడి పండించే పంటలకు గిట్టుబాటు ధర కల్పించలేదా అని ప్రశ్నించారు. జై జవాన్, జై కిసాన్ నినాదాలు ఉత్త ముచ్చటేనా అని ఎద్దేవా చేశారు. రైతే దేశానికి వెన్నెముక అంటూనే రైతు వెన్నులో తూటాలు దించిన హతక మోడీ ప్రభుత్వానికి ప్రజలు గుణపాఠం చెప్పాలని అన్నారు. రైతులపై కాల్పులకు అదేశాలిచ్చిన హర్యానా ప్రభుత్వాన్ని భర్తరఫ్ చేసి,సీఎం, హోం మినిస్టర్ లపై హత్యానేరం కేసు నమోదు చేయాలని,విధుల్లో పాల్గొన్న పోలీసు అధికారులను విధుల నుండి తొలగించాలని డిమాండ్ చేశారు. 25 ఏండ్ల యువ రైతు శుభకరన్ సింగ్ మృతికి కేంద్ర ప్రభుత్వo బాధ్యత వహించాలని, దేశ ప్రజలకు మోడీ బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. రైతుల సమస్యలపై చర్చించడానికి ప్రత్యేక పార్లమెంటు సమావేశాలు నిర్వహించాలని అన్నారు. దేశంలో అన్నదాతలు అలాంటిస్తుంటే మోడీ ప్రభుత్వంలో చలనం లేకపోవడం శోచనీయం అన్నారు.వెంటనే రైతు పండించిన పంటలకు మద్దతు ధర కల్పిస్తూ (MSP) చట్టం చేయాలని, రైతు ఉద్యమంలో ప్రాణాలు కోల్పోయిన రైతు కుటుంబాలను ఆదుకోవాలని, కార్మిక కొత్త చట్టాలను ఉపసంహరణ చేసుకోవాలని డిమాండ్ చేశారు.లేకుంటే రైతు ఆగ్రహ జ్వాలలకు బీజేపీ ప్రభుత్వం పతనం కాక తప్పదని హెచ్చరించారు. ఈ బ్లాక్ డే కార్యక్రమంలో IFTU జిల్లా ఉపాధ్యక్షులు కునుకుంట్ల సైదులు, PDSU రాష్ట్ర ఉపాధ్యక్షులు పోలేబోయిన కిరణ్, BOC జిల్లా కార్యదర్శి దేసోజు మధు, SDLC సభ్యులు, పోరడ్ల దశరద, PYL జిల్లా కోశాధికారి బండి రవి, డేగల వెంకటకృష్ణయ్య, గుణగంటి శ్రీను, గడ్డం ఎల్లయ్య, ఎస్. కే రహీం, గపార్ తదితరులు పాల్గొన్నారు.