ప్రజల రక్షణ శాంతిభద్రతలకు సంబంధించిన ఫిర్యాదులపై ఎప్పటికప్పుడు సత్వరమే స్పందించి తగు చర్యలు తీసుకోవాలి ఎస్పి

May 19, 2025 - 20:54
 0  1
ప్రజల రక్షణ శాంతిభద్రతలకు సంబంధించిన ఫిర్యాదులపై ఎప్పటికప్పుడు సత్వరమే స్పందించి తగు చర్యలు తీసుకోవాలి ఎస్పి

జోగులాంబ గద్వాల 19 మే 2025 తెలంగాణ వార్తా ప్రతినిధి : గద్వాల  ప్రజల రక్షణ, శాంతి భద్రతలకు సంబందించిన ఫిర్యాదుల పై   ఎప్పటికప్పుడు సత్వరమే స్పందించి తగు చర్యలు తీసుకోవాలని జిల్లా ఎస్పీ శ్రీ టి. శ్రీనివాస రావు ఐపీఎస్ పోలీస్ అధికారులను ఆదేశించారు. సోమవారం ప్రజావాణి సందర్భంగా జిల్లా లో వివిధ ప్రాంతాల నుండి వచ్చిన  పిర్యాదు దారుల నుండి 13 అర్జీలను జిల్లా ఎస్పీ  ఆలంపూర్ , గద్వాల్ సర్కిల్ అధికారుల సమక్షంలో స్వీకరించారు. 


   ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ ఆయా ఫిర్యాదులకు సంబంధించి తీసుకున్నా చర్యలను సర్కిల్ అధికారులను అడిగి తెలుసుకోవడం తో పోలీస్ స్టేషన్ SHO లతో ఫోన్ లో మాట్లాడుతూ శాంతి భద్రతలకు విఘాతం కల్గించే వారి, అమాయక ప్రజలను చీటింగ్ చేసే వారిపై, దౌర్జన్యాలకు పాల్పడే వారి పై , భూ కబ్జాలు చేసే వారి పై చట్టప్రకారం కఠినంగా వ్యవహరించాలని, మహిళల భద్రతకు సంబంధించి మహిళలను వేదింపులు, దుర్బాషలడటం, బెదిరింపుల పై సత్వరం స్పందించడం తో పాటు భాద్యుల పై కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు. కుటుంబ సభ్యులు, భార్యాభర్తల మధ్య  కుటుంభ సమస్యలను సునితమైనవి గా భావించి ప్రతి శనివారం పోలీస్ శాఖ ఆధ్వర్యంలో డి. ఎస్పీ కార్యాలయ ఆవరణలో  నిర్వహించే కౌన్సిలింగ్ కు పంపి అవగాహన కల్పించే టట్లు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సివిల్ వివాదాలకు సంబంధించిన ఫిర్యాదులు పోలీస్ స్టేషన్ లలో  స్వీకరించబడవు అనే విషయాన్ని పిర్యాదు దారులు గ్రహించాలని, వాటిని కోర్టు లలో  పరిష్కరిoచుకోవాలని అన్నారు. 

ఈ రోజు వచ్చిన పిర్యాదులు
భూ వివాదాలకు సంబంధించి - 06 ఫిర్యాదులు. 
భర్త వేధింపులకు సంబందించి - 01 పిర్యాదు 

గొడవలకు సంబంధించి - 02 పిర్యాదులు.
ప్లాట్స్ కబ్జా,  భూమీ కబ్జా, ప్లాట్ పై ఇతరులు లోన్ తీసుకోవటం గురించి - 03 పిర్యాదులు. 
ఇతర అంశాలకు సంబంధించి- 01పిర్యాదు రావడం జరిగిందని పి ఆర్ ఓ ఆఫీస్ నుంచి తెలియజేశారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333