మల్లన్న దీవెనలు నియోజకవర్గ ప్రజలందరికీ ఉండాలి
కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు నీలం మధు ముదిరాజ్
జిన్నారం మార్చి 9 తెలంగాణ వార్త ప్రతినిధి:- గ్రామీణ ప్రాంతాల్లో జాతర మహోత్సవాలు అహల్లాద వాతావరణాన్ని కలిగించడమే కాకుండా ఆధ్యాత్మిక చింతన వైపు ప్రజలను మళ్లీస్తాయని కాంగ్రెస్ నాయకులు నీలం మధు ముదిరాజ్ తెలిపారు
జిన్నారం మండలం ఊట్ల గ్రామంలో నిర్వహించిన జాతర మహోత్సవంలో పాల్గొని శ్రీశ్రీశ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి వారికి పూజలు నిర్వహించారు, గ్రామాల్లో జాతర పండుగలా నిర్వహించుకుని అందరూ ఒకచోట చేరడంతో ఆహ్లాదకర వాతావరణం చోటు చేసుకుంటుంది అన్నారు ప్రజలు సుఖ సంతోషాలతో ఉండేలా స్వామివారు చూడాలని ఆయన కోరినట్లు తెలిపారు, కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో బీద,బడుగు బలహీన వర్గాల వారికి సరైన న్యాయం జరుగుతుందని ఆయన తెలిపారు ఆరు పథకాలతో ప్రజలు ఎంతో సంతోషంగా ఉన్నారని, పూర్తిస్థాయిలో అమలవుతాయని ధీమా వ్యక్తం చేశారు జాతర నిర్వాహకులు నీలం మధు ముదిరాజ్ ఘన స్వాగతం పలికి ఘనంగా సత్కరించారు,ఈ కార్యక్రమంలో ఎంపీపీ రవీందర్ గౌడ్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు శ్రీకాంత్ రెడ్డి, ఎంపీటీసీ జనాబాయి, నరేష్, మహేందర్ రెడ్డి,మహేష్, ప్రతాప్ రెడ్డి,సత్యా నారాయణ యాదవ్, శ్రీశైలం యాదవ్, లక్ష్మణ్ యాదవ్,నర్సింలు యాదవ్, మహేందర్ యాదవ్, గ్రామ పెద్దలు, ప్రజలు, జాతర నిర్వాహకులు,ఎన్ఎంఆర్ యువసేన సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.