బొడ్రాయి  మహోత్సవంలో శాంతి కళ్యాణం 

May 19, 2025 - 20:55
 0  6
బొడ్రాయి  మహోత్సవంలో శాంతి కళ్యాణం 

నాగారం మే 19 తెలంగాణ వార్త : నాగారం మండల పరిధిలోని ఈటూరు గ్రామంలో బొడ్రాయి ప్రతిష్టాపన మహోత్సవంలో భాగంగా సోమవారం శాంతి కళ్యాణ వేడుకలను ఘనంగా నిర్వహించారు. గ్రామస్తులంతా ఏకధాటిపై బొడ్రాయి (నాభి శిల) ప్రతిష్టాపనకు  వైదికంగా బ్రహ్మశ్రీ కొండగడప హరిప్రసాద్ శర్మ పురోహితులు కాశీ లక్ష్మణ శర్మ ఆధ్వర్యంలో మూడవ రోజు   గణపతి పూజ పుణ్యాహవాచనం  బీజనాస్యం  యంత్ర స్థాపన  నాభిశిలా ప్రతిష్ట ప్రాణ ప్రతిష్ట హోమము బలి పూర్ణాహు తి కుంబాభిషేకములు శాంతి కళ్యాణం ఆశీర్వచనం గ్రామ దేవతకు పంచా బోనాలు ధూప దీప నైవేద్యాలు  ప్రత్యేక పూజాకార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో
 ఆచార్యులు శేషగిరి  కాశివేణు శాస్త్రి గ్రామ పెద్దలు భక్తులు తదితరులు పాల్గొన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333