పోలీసు అమరవీరుల త్యాగాలు మరువలేనివి ఎస్సై వెంకటేశ్వర్లు

Oct 21, 2025 - 20:08
Oct 21, 2025 - 20:30
 0  79
పోలీసు అమరవీరుల త్యాగాలు మరువలేనివి ఎస్సై వెంకటేశ్వర్లు

ప్రపంచమంతా నిద్రపోయినా మేల్కొని వుండే ఒకే ఒక్క రక్షక భటుడు పోలిస్.. 

ప్రతి ఒక్కరు ఏ ఆపదకైనా ఆశ్రయించేది పోలీసులనే !

ఇరవైనాలుగు గంటల ఉద్యోగం. ఒక్క పోలీసు ఉద్యోగమే!

సంపన్నుడు మొదలు సామాన్యుడి వరకు ప్రతి ఒక్కరూ ప్రతీ అవసరానికి సాయం కోరేది పోలీసులనే!

పోలీసులు లేని సమాజాన్ని ఏమాత్రం ఊహించలేం... 

పోలీసులను చూస్తే కొండత ధైర్యం కలుగుతుంది.... 

ఆంటీ నార్కోటిక్ డ్రగ్, డాగ్ స్క్వాడ్ విభాగాల విధులు... 

ప్రజల రక్షణ లో పోలీసుల సేవలు.. 

పోలీసులు లేని సమాజాన్ని ఏమాత్రం ఊహించలేం.. 

తిరుమలగిరి 22 అక్టోబర్ 2025 తెలంగాణ వార్త రిపోర్టర్ : సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మండల కేంద్రంలోని అక్టోబర్ 21 పోలీసు అమరవీరుల సందర్భంగా పోలీస్ స్టేషన్ పరిధిలో అమరవీరులకు నివాళులర్పించి అనంతరం తెలంగాణ చౌరస్తా వరకు వివిధ పాఠశాలల విద్యార్థుల చే భారీ ర్యాలీ నిర్వహించారు అనంతరం తిరుమలగిరి ఎస్సై వెంకటేశ్వర్లు మాట్లాడుతూ    తిరుమలగిరి పోలీస్ స్టేషన్ పై నక్సస్ దాడి చేసి ఇద్దరు పోలీసులను బలిగొన్న విషాద సంఘటనకు 17 ఏళ్లు ఏళ్లు 2007 జూలై 7న సుమారు 48 నక్సల్స్ స్టేషన్ పై దాడికి పాల్పడి పెట్రోల్ పోసి నిప్పంటించారు విధినిర్వహణలో ఉన్న కానిస్టేబుల్ శ్రీరామ్ రెడ్డి హెడ్ కానిస్టేబుల్ బడే సాబ్ ల పై కాన్పులు జరిపి వారిని హతమార్చి స్టేషన్లో ఉన్న ఆయుధాలను అపహరించి పోయారు. విధి నిర్వహణలో అమరులైన పోలీసుల త్యాగాలు మనకు స్ఫూర్తి అన్నారు. పగలు రాత్రి తేడా లేకుండా సమాజంలో శాంతి భద్రతలను కాపాడుతూ అవసరమైతే ప్రాణత్యాగం చేయడానికి కూడా పోలీసులు వెనుకాడరని కొనియాడారు. తీవ్రవాదం, ఉగ్రవాదం, మతతత్వ ధోరణిలో సంఘ విద్రోహక శక్తులు హింసలకు పాల్పడుతున్నాయని.. ఇలాంటి శక్తుల్ని ఎదుర్కొంటూ ఎందరో పోలీసు సోదరులు వీరమరణం పొందారన్నారు. పోలీస్ అమరవీరుల త్యాగాలు మరువలేనివని చెప్పారు. పోలీసుల అమరత్వం నుంచి స్ఫూర్తిని, ప్రేరణ పొందుతున్నామన్నారు. పోలీసు అంటేనే పట్టుదల, ఓర్పు, సహనమని శాంతి భద్రతలు కాపాడేందుకు వారు చేసే కృషి మరువలేనిదన్నారు. ఈ కార్యక్రమంలో ఏఎస్ఐ రత్నం ,హెడ్ కానిస్టేబుల్ వెంకన్న ,మురారి సైదులు ,రమేష్ ,సైదులు, సంజీవ చారి నాగవేణి, అనూష ,లావణ్య ,విద్యార్థులు ఉపాధ్యాయులు ప్రజలు తదితరులు పాల్గొన్నారు.. 

జేరిపోతుల రాంకుమార్ తిరుమలగిరి విలేకరి మరియు తుంగతుర్తి నియోజకవర్గం ఇన్చార్జి