పేద ప్రజల అభివృద్ధి ప్రభుత్వ లక్ష్యం.... కొలిశెట్టి బుచ్చి పాపయ్య

Aug 1, 2025 - 10:50
Aug 1, 2025 - 20:01
 0  0
పేద ప్రజల అభివృద్ధి ప్రభుత్వ లక్ష్యం.... కొలిశెట్టి బుచ్చి పాపయ్య
లబ్ధిదారులకు రేషన్ కార్డులు అందజేస్తున్న బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బుచ్చి పాపయ్య

లబ్ధిదారులకు నూతన రేషన్ కార్డులను అందజేత... 

బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కొల్లిశేట్టి బుచ్చి పాపయ్య

మునగాల 01 ఆగస్టు 2025 తెలంగాణ వార్త ప్రతినిధి :    పేదవారికి కడుపు నింపే ఆహార భద్రత కల్పించే సన్నబియ్యం,నూతన రేషన్ కార్డుల కార్యక్రమాన్ని మించిన సంక్షేమ పథకాలు ఏ రాష్ట్రంలో లేవని బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కొల్లిశేట్టి బుచ్చి పాపయ్య అన్నారు.మండలంలో తాడ్వాయి గ్రామంలో గ్రామ పంచాయతీ వద్ద గురువారం లబ్ధిదారులకు నూతన రేషన్ కార్డులను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజా పాలన దరఖాస్తులు మీసేవ ద్వారా వచ్చిన దరఖాస్తులు పరిశీలన చేసి వాటి ఆధారంగా ప్రతి ఒక్కరికి రేషన్ కార్డులు మంజూరు చేయడం జరిగిందని అన్నారు. అర్హులైన‌ వారందరికీ సన్న బియ్యం అందించడమే ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. ఈ కార్యక్రమంలో సొసైటీ డైరెక్టర్ గట్టు ఉపేందర్ రావు, మండల కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి జిల్లేపల్లి వెంకటేశ్వర్లు,మాజీ యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు సోమపంగు గోపి,యూత్ నాయకులు జిల్లేపల్లి వినయ్, రేషన్ డీలర్ కస్తాల లక్ష్మి, మాజీ వార్డు సభ్యురాలు మచ్చ మంగతాయరమ్మ,కె లింగయ్య, లబ్ధిదారులకు తదితరులు పాల్గొన్నారు.

A Sreenu Munagala Mandal Reporter Suryapet District Telangana State