మల్దకల్ తిమ్మప్ప స్వామి మన్నించు

ఆదాయం లేకపోవడంతో ప్రతిరోజు పల్లకి సేవకు డోలు బంద్ చేసిన అధికారులు

May 30, 2024 - 17:36
 0  13
మల్దకల్ తిమ్మప్ప స్వామి మన్నించు

భక్తులు పెరిగారు కానీ ఆదాయం పెరగడం లేదా? 

సంవత్సర కాలంగా నయా పైసా ఇవ్వని అధికారులు...

ఇంకెన్నాళ్లు వెట్టిచాకిరి?

జోగులాంబ గద్వాల 30 మే 2024 తెలంగాణ వార్తా ప్రతినిధి:- మల్దకల్. తిమ్మప్ప స్వామివారి పల్లకి సేవకు ప్రతిరోజు డోలు మేళాలతో అంగరంగ వైభవంగా నిర్వహించేవారు. కానీ గత సంవత్సర కాలంగా స్వామివారి పల్లకి ఊరేగింపుకు డోలు వాయించే వ్యక్తికి నయా పైసా చెల్లించకుండా వెట్టిచాకిరి చేయించుకున్నారు. విసుకు చెందిన సదరు వ్యక్తి కొన్ని రోజులుగా స్వామివారి పల్లకి సేవకు డోలు వాయించడం   లేదు కానీ దేవాలయ అధికారులు మాత్రం ఉన్న రెండు మేలలతో పని  కానీచేస్తున్నారు. ఇది చూసిన భక్తులు  జిల్లాలోనే అతి పెద్ద దేవాలయంగా చెప్పుకునే తిమ్మప్ప స్వామి పల్లకి సేవకు డోలు లేకుండా కేవలం మెలాలతోనే తీసుకుపోవడంపై దేవాలయ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నా ప్రజలు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333