చిర్రగూడూర్ పాఠశాలకు గ్రీన్ బోర్డ్స్ బహుకరణ..శీల కుమార్

అడ్డగూడూరు 01 ఆగస్టు 2025 తెలంగాణవార్త రిపోర్టర్:– యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు మండల పరిధిలోని చిర్రగూడూర్ గ్రామం మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలకు శీల కుమార్ రెండు గ్రీన్ బోర్డులను బహుమతిగా అందించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..విద్యార్థులందరూ ఇష్టంతో కష్టపడి చదవాలన్నారు.తను చదువుకునే రోజులలో ఇదే పాఠశాలలో కష్టపడి చదువుకొని హైదరాబాదులోని చర్లపల్లిలో కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్నానని అన్నారు.ప్రతి ఒక్క విద్యార్థి కష్టపడి బాగా చదువుకొని గొప్ప మార్కులు సాధించుకోవాలని విద్యార్థులకు భవిష్యత్ లో తన వంతు సహకారం ఎల్లప్పుడూ ఉంటాయన్నారు.ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు దేవసరి నవీన్,ఉపాధ్యాయులు చుక్క లోకేష్,విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.