ఘనంగా దొడ్డి కొమురయ్య 78వ వర్థంతి.

Jul 4, 2024 - 19:28
 0  10
ఘనంగా దొడ్డి కొమురయ్య 78వ వర్థంతి.

తెలంగాణ సయుధ పోరాట తొలి అమరుడు కొమరయ్య స్ఫూర్తి నేటి సమాజానికి మార్గం కావాలి .

సీపీఐ జిల్లా కార్యదర్శి బి ఆంజనేయులు. 

జోగులాంబ గద్వాల 4 జులై 2024 తెలంగాణ వార్త ప్రతినిధి: నాటి తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట స్ఫూర్తి దొడ్డి కొమరయ్య త్యాగం భవిష్యత్తు తరాలకు ఆణగారిన, అనచబడ్డ జాతులకు ఆయుధంగా ఉంటుందన్నారు. సీపీఐ జిల్లా కార్యదర్శి బి ఆంజనేయులు. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో తొలి అమరుడు దొడ్డి కొమురయ్య పేరు తెలంగాణ చరిత్రలో సువర్ణ ఆక్షరాలతో లిఖించబండిందన్నారు. 
దొడ్డి కొమురయ్య 78వ వర్థంతిని సిపిఐ ఆధ్వర్యంలో గురువారం గద్వాల సిపిఐ జిల్లా కార్యాలయం నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఐ aisf, ఏఐటీయూసీ నాయకులు  దొడ్డి కొమురయ్య చిత్ర పటానికి  పూలమాలాలు వేసి నివాళ్లు అర్పించారు. సిపిఐ జిల్లా కార్యదర్శి ఆంజనేయలు మాట్లాడుతూ..
.. ప్రజా సమస్యల పరిష్కారానికి నాటి దొడ్డి కొమురయ్య లాంటి అనేక మంది అమరవీరుల స్ఫూర్తి మరింత సమరశీల పోరాటాలు నిర్వహించేలా చేస్తాయని పేర్కొన్నారు. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో మొట్టమొదటి అమరుడుని ఈ తెలంగాణ సమాజం ఎన్నటికీ మరువదని స్పష్టం చేశారు.4500 మంది ప్రాణ బలిదానాలు జరగగా, 10 వేల గ్రామాలను విముక్తి చేసి 10 లక్షల ఎకరాల భూమిని పేదలకు పంచిన ఘన చరిత్ర కమ్యూనిస్టు పార్టీ. సీపీఐ దని ,  అయితే నేడు దానిని కొంత మంది వక్రీకరించే ప్రయత్నం చేస్తున్నారు.  స్వాతంత్య్రం సిద్దించి 78 ఏళ్లు పూర్తి అవుతున్నా నేటికి 80 శాతం మంది ఎస్ ఎస్ బిసిలకు వాటి ఫలాలు అందుకోలేని పరిస్థితి ఉండడడం దారుణమన్నారు. భూమి కోసం, భుక్తి, కోసం వెట్టి చాకిరి విముక్తి కోసం నిజాం నిరంకుశ రాజ్యం అంతం కోసం సమసమాజం లక్షమే ధ్యేయంగా నాడు సాగించిన తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటల యోధుల ఆశయం నేరవేరాలంటే  దేశవ్యాప్తంగా బిసి కుల గణన చేపట్టి, జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లు కల్పించడం ద్వారానే సాధ్యం అవుతుందన్నారు. నేటికీ 90 శాతం ప్రజలకు  సరైన కూడు, గూడు, నాణ్యమైన విద్య, వైద్యానికి నోచుకోడంలేదని, వీరందరికీ న్యాయం జరగాలంటే నాటి తెలంగాణ సాయుధ పోరాట యోధుల స్ఫూర్తితోఅందరూ కలిసి కట్టుగా మరింత పెద్దఎత్తున ఉద్యమించాలని కోరారు.ఈ కార్యక్రమం లో Aisf జిల్లా ఆర్గనైజింగ్ కార్యదర్శి ప్రవీణ్, రైతు సంఘం కార్యదర్శి ఆశన్న, ఏఐటీయూసీ రీక్ష కార్మిక సంఘంనాయకులు ప్రభుదాస్, దేవన్న, aisf నాయకులు వీరేష్, గురుస్వామి, వీర చరణ్ రాజు తదితరులు పాల్గొన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333