పేకాట ఆడుతున్న వ్యక్తులను అదుపులో తీసుకున్న ఎస్ఐ నాగరాజు
అడ్డగూడూరు 03 డిసెంబర్ 2024 తెలంగాణవార్త రిపోర్టర్:- యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు మండల కేంద్రంలోని పేకాట ఆడుతుండగా దొరికిన వ్యక్తులను పట్టుబడి చేసి అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్ తరలించిన ఎస్ఐ నాగరాజు పేకాట ఆడుతున్న వ్యక్తులను గుర్తించారు.గజ్జెలి రవి తండ్రి రామనర్సయ్య,మేకల చంద్రయ్య తండ్రి శాంతయ్య,గుడెపు వెంకన్న తండ్రి ముత్తయ్య,చిన్నం మహంకాళి తండ్రి ముత్తయ్య,మందుల నరసింహ తండ్రి ముత్తయ్య, చెడేపల్లి అంజయ్య తండ్రి మల్లయ్య,ఎలిజాల దయాకర్ సామెల్,గుడెపు పరమేష్ తండ్రి ఎల్లయ్య,పేకాట రాయుళ్ల వద్ద నుండి పేకాట ఆడుతుండగా.. వారి వద్ద నుండి 2,500 రూపాయలు మరియు 7సెల్ ఫోన్లు వారి వద్ద నుండి స్వాధీనపర్చుకోవడమైనది అన్నారు.ఈ విధంగా అడ్డగూడూరు మండల వివిధ గ్రామాలలో కానీ కేంద్రంలో కానీ ఎవరైనా పేకాట ఆడినట్లయితే కఠిన చర్యలు తీసుకోబడును అని ఎస్సై నాగరాజు తెలిపారు.