బీజేపీ పార్టీ గెలుపే లక్ష్యంగా పని చేద్దాం

ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షులు చింత వినయ్ బాబు మాదిగ 

May 9, 2024 - 20:49
May 9, 2024 - 20:54
 0  5
బీజేపీ పార్టీ గెలుపే లక్ష్యంగా పని చేద్దాం
బీజేపీ పార్టీ గెలుపే లక్ష్యంగా పని చేద్దాం
బీజేపీ పార్టీ గెలుపే లక్ష్యంగా పని చేద్దాం
బీజేపీ పార్టీ గెలుపే లక్ష్యంగా పని చేద్దాం

ఆత్మకూరు (ఎస్) 09 మే 2024 తెలంగాణవార్త రిపోర్టర్:- ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక జాతీయ అధ్యక్షులు మహాజన నేత మందకృష్ణ మాదిగ ఆదేశాల మేరకు ఆత్మకూరు (ఎస్), మండలంలోని పలుగ్రామాల్లో నెమికల్, మిడతనపల్లి మక్త కొత్తగూడెం తుమ్మల పహాడ్ గ్రామాల్లో బీజేపీ పార్లమెంట్ అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డి గెలుపుకోసం గ్రామాల్లోని మాదిగ వాడ వాడలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు అనంతరం ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షులు చింత వినయ్ బాబు మాదిగ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ మాదిగలను నిలువునా మోసం చేసిందని అన్నారు 

 తెలంగాణ లో 17 పార్లమెంట్ స్థానాలు ఉంటే అందులో మూడు యస్.సి నియోజకవర్గాలు ఉంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో 80 లక్షలమంది మాదిగల సామాజిక వర్గం ఉంటే కనీసం ఒక్కటైన అవకాశం కల్పించాకుండా మాదిగలను చాలా అవమానించినా కాంగ్రెస్ పార్టీ ఈ ఎన్నికల్లో మాదిగలు ఓటు రూపంలో బుద్ధి చెప్పాలని కాంగ్రెస్ మాదిగలను మోసం చేసినందుకు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు చిత్తు చిత్తుగా ఓడించేందుకే మాదిగలు సిద్ధం  కావాలని యస్.సి రిజర్వేషన్ల వర్గీకరణ బిల్లుకు కట్టుబడి ఉన్న ప్రధాని నరేంద్ర మోదీ ని కేంద్రంలో మళ్ళీ అధికారంలోకి వచ్చే విధంగా ప్రతి ఒక్కరూ బీజేపీ పార్టీకి ఓటేయాలని మన అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డి ని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని పిలుపునిచ్చారు.

  ఈ కార్యక్రమంలో  ఆత్మకూరు ఎస్ ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షులు మేడి కృష్ణ మాదిగ సూర్యాపేట పట్టణ అధ్యక్షులు బొజ్జ వెంకన్న మాదిగ  సూర్యాపేట రూరల్ మండల అధ్యక్షులు తాటిపాముల నవీన్ మాదిగ చివ్వెంల  మండల అధ్యక్షులు  సిరిపంగి నవీన్ మాదిగ ఎంఎస్పి మండల అధ్యక్షులు చెరుకుపల్లి కిరణ్ మాదిగ జలగం బాబు మాదిగ ములకలపల్లి నరేష్ మాదిగ మొలకలపల్లి శీను మాదిగ అర్జున్ మాదిగ  హుస్సేన్ మాదిగ సైదులు మాదిగ రాములు మాదిగ ఎల్లయ్య మాదిగ తదితరులు పాల్గొన్నారు..

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333