పర్యావరణ పరిరక్షణ” పై అవగాహన-శిక్షణ కార్యక్రమం
సూర్యాపేట, 19 మార్చి తెలంగాణవార్త ప్రతినిధి :- “పర్యావరణ పరిరక్షణ” స్టడీ టూర్ లో భాగంగా రాయనిగూడెం వి. సి. కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్, వి. సి. ఇనిస్ట్రీట్యూట్ ఆఫ్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ కళాశాల విద్యార్థిని విద్యార్థుల క్షేత్ర పర్యటన - అవగాహన మరియు శిక్షణ కార్యక్రమం ఈ రోజు (తేదీ:18.03.2026) సూర్యాపేట మండలంలోని, కాసరాబాద్ గ్రామ పంచాయతిలో, తెలంగాణ నేషనల్ గ్రీన్ క్రాప్స్ ఆధ్వర్యంలో మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ ఎడ్యుకేషన్ క్షేత్ర పర్యటన ప్రోగ్రాంలో భాగంగా ఘన వ్యర్ధాలు వేరు చేయు విధానంపై ఘన వ్యర్ధాల నిర్వహణ కేంద్రం (సెగ్రీగేషన్ షెడ్) లో వి. సి. కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్, వి. సి. ఇనిస్ట్రీట్యూట్ ఆఫ్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ కళాశాల విద్యార్థిని విద్యార్థులకు అవగాహన శిక్షణ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. తడి-పొడి చెత్త వేరు చేయడం కంపోస్టు ఎరువు తయారీ విధానాన్ని, టి. ఎన్. జి. సి కోఆర్డినేటర్ సూర్య కిరణ్ మరియు స్వచ్ఛ భారత్ కోఆర్డినేటర్ నరేందర్ రెడ్డి, కన్సల్టెంట్ ఆర్. హరి వివరించారు. ప్రతి ఒక్కరూ ఇంటి స్థాయిలోనే తడి చెత్తను, పొడి చెత్తను వేరు చేస్తూ పర్యావరణ పరిరక్షణలో తమ వంతు బాధ్యతగా కృషి చేయాలని సూచించారు. రెండు గుంతల మరుగుదొడ్డి నిర్మాణం, ఆవశ్యకత, తడి-పొడి చెత్త, సేంద్రీయ ఎరువు తయారీ, ప్లాస్టిక్ వేస్ట్ మేనేజ్మెంట్, ఫికల్ స్లడ్జ్ మేనేజ్మెంట్ తదితర విషయాలపై అవగాహన, శిక్షణ కార్యక్రమ జరిగినది. ఇట్టి కార్యక్రమంలో యం.పి.ఓ. Y. లింగా రెడ్డి, గ్రామ సర్పంచ్ గోవింద రెడ్డి, పంచాయతీ కార్యదర్శి నవీన్, కళాశాల ప్రిన్సిపాల్ సతీష్ కుమార్ అధ్యాపకులు, కళాశాల విద్యార్థిని విద్యార్థులు మరియు పారిశుద్ధ్య కార్మికులు పాల్గొన్నారు.
కో-ఆర్డినేటర్
జిల్లా స్వచ్చ భారత్ మిషన్, (గ్రామీణ)
O/o డి. ఆర్. డి. ఏ, సూర్యాపేట జిల్లా