రంజాన్ పండుగను ఘనంగా జరుపుకోవాలి

Mar 18, 2026 - 21:12
Mar 18, 2026 - 21:23
 0  1
రంజాన్ పండుగను ఘనంగా జరుపుకోవాలి

సూర్యాపేట, 19 మార్చి తెలంగాణవార్త ప్రతినిధి :- రంజాన్ పండుగను ఘనంగా జరుపుకోవాలని మున్సిపల్ చైర్ పర్సన్ మొరిశెట్టి నివేదిత లక్షాధి, ఏఐసిసి సభ్యులు రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పుల వేణారెడ్డి లు అన్నారు. బుధవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలో 44వ వార్డు కౌన్సిలర్  గుణగంటి హేమ సతీష్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన తోఫా పంపిణీ కార్యక్రమానికి వారు ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పవిత్ర రంజాన్ మాసాన్ని పురస్కరించుకొని ఉపవాస దీక్షలు పాటిస్తున్న ముస్లిం కుటుంబాలకు ఈ రంజాన్ మాసం విశేషం అయిందని అన్నారు.ముస్లిం మైనార్టీ సోదరులు, సోదరీమణులందరికీ రంజాన్ పర్వదిన శుభాకాంక్షలు తెలిపారు. పవిత్ర రంజాన్ మాసం ప్రతి కుటుంబానికి శాంతి, సంతోషం, సమృద్ధి తీసుకురావాలని, అల్లాహ్ ఆశీస్సులతో అందరూ సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ కొండపల్లి దిలీప్ రెడ్డి, ఇస్తారు రహమత్, షేక్ మన్సూర్ అలీ, బందు శ్రీధర్ బాబు, జహీర్, మన్సూర్, సాయి, సోహెల్, మునీర్ తదితరులు పాల్గొన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333