ప్రజలకు ఉగాది పండుగ శుభాకాంక్షలు.. ఎస్పి నరసింహ ఐపిఎస్
సూర్యాపేట, 19 మార్చి తెలంగాణవార్త ప్రతినిధి :- ఉగాది పండుగల సందర్భంగా జిల్లా ప్రజలకు పోలీస్ శాఖ తరపున ఎస్పీ నరసింహ ఐపిఎస్ పండగ శుభాకాంక్షలు తెలియజేశారు. ఉగాది, రంజాన్ పండుగ సందర్భంగా ప్రజలందరూ సోదరా భావంతో కలిసిమెలిసి ఉత్సవంగా జరుపుకోవాలని కోరారు. ఇతరులకు ఇబ్బంది కలిగే విధంగా ఎవరు కూడా ప్రవర్తించకూడదని ఒకరికొకరు గౌరవించుకుంటూ పండుగలు జరుపుకోవాలని అన్నారు. గొడవలు పడకుండా ఉండాలని కోరారు.