ప్రోటోకాల్ పాటించని అధికారులపై చర్యలు తీసుకోవాలి
అలంపూర్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే గా ఉన్న తన పట్ల అధికారులు అధికారిక కార్యక్రమాలల్లో ప్రోటోకాల్ పాటించటం లేదని అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు గారు అన్నారు. ఈ మేరకు ఆయన స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ కు ఫిర్యాదు చేసారు. ప్రభుత్వం తరపున చేస్తున్న రంజాన్ తోఫా, ఇఫ్తార్ విందులకు ప్రోటో్కాల్ పాటించక పోగా సమాచారం కూడా ఇవ్వకుండా అధికారులు నిర్లక్ష్యం చేస్తున్నారని అలాంటి వారిపై చర్యలు తీసుకోవాలని విన్నవించారు. అనంతరం స్పీకర్ గారు సానుకూలంగా స్పందించి చర్యలు తీసుకుంటానని ఎమ్మెల్యే గారు కు హామీ ఇచ్చారు