పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మెలం
తెలంగాణ వార్త ఆత్మకూరు యస్:- మండలం పరిధి లో ఏపూర్ ఉన్నతపాఠశాలలో 2003-04లో పదో తరగతి చదివిన పూర్వవిద్యార్థులు ఆదివారం ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎక్కడెక్కడో స్థిరపడిన వారంతా ఒకచోట చేరి గత అనుభవాలు నెమరు వేసుకున్నారు. 20 సంవత్సరాల తర్వాత కలుసుకున్న వారంతా ఒకరికొకరు పలకరించుకొని రోజంతా ఆనందంగా గడిపారు. అనంతరం ఆనాటి ఉపాధ్యాయులను పూర్వవిద్యార్థులు సన్మానించారు. తమతో చదువుకున్న కొంతమంది మిత్రులు చనిపోవడం తో వారికి నివాళ్ళు అర్పించారు.ఈ కార్యక్రమంలో......సత్యనారాయణ,సోమయ్య,బిక్షం,వెంకట్నారాయణ,వెంకటయ్య,నారాయణరావు,మల్లయ్య,సత్యనారాయణ, అజీత్,సుధగని వెంకన్న మిత్రులు తదితరులు పాల్గొన్నారు