మానవ తప్పిదాలతోనే ఎక్కువ రోడ్డు ప్రమాదాలు.
- జీవితంలో క్రమశిక్షణగా ఉంటే ఉన్నత స్థానాలకు చేరుతారు.
- రోడ్డు పై క్రమశిక్షణగా ఉంటే సురక్షితంగా గమ్యానికి చేరుతారు.
- క్షేమంగా ఉంటేనే అనుకున్న లక్ష్యాలు సాధించవచ్చు.
- డిఫెన్సివ్ డ్రైవింగ్ చేయాలి.
- మొబైల్ మాట్లాడుతూ వాహనం నడపవద్దు.
- మైనర్ డ్రైవింగ్ తో.. మీకు ఎదుటి వారికి ప్రమాదం.
- రోడ్డుకు లెఫ్ట్ సైడ్ డ్రైవింగ్ ఆల్ వేస్ రైట్.
- హెల్మెట్, సీట్ బెల్ట్ విడిగా పెట్టుకోవాలి.
- ప్రజల రక్షణలో పోలీస్ శాఖ అనుక్షణం కృషి చేస్తుంది.
... కె.నరసింహ ఐపిఎస్, ఎస్పి సూర్యాపేట జిల్లా.
రోడ్డు ప్రమాదాలు నివారించడం, రోడ్డు ప్రమాదంలో ఏ ఒక్కరు మరణించకుండా సురక్షితంగా గమ్యం చేరడం, రోడ్డు భద్రతా నియమాలు తెలియజేయడం లక్ష్యంగా రాష్ట్ర పోలీస్ శాఖ ఆధ్వర్యంలో అరైవ్ అలైవ్ రోడ్డు భద్రత మహాఉద్యమం కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది, జిల్లా వ్యాప్తంగా వారం రోజులపాటు ప్రజలకు రోడ్డు భద్రత పట్ల అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.
అరైవ్ అలైవ్ కార్యక్రమంలో భాగంగా సూర్యాపేట పట్టణం లో గల శ్రీ వెంకటేశ్వర ఇంజనీరింగ్ కళాశాల నందు విద్యార్థులకు రోడ్డు భద్రత పట్ల అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి జిల్లా ఎస్పీ నరసింహ ఐపీఎస్ గారు ముఖ్యఅతిథిగా హాజరై రోడ్డు భద్రత నివారణ చర్యల గురించి మాట్లాడారు. జీవితంలో క్రమశిక్షణ ఉంటే ఉన్నత స్థానాలకు చేరుతారు., రోడ్డు పై క్రమశిక్షణ ఉంటే సురక్షితంగా గమ్యానికి చేరుతారు. విద్యార్థులు బాధ్యతగా ఉండాలి రోడ్డు భద్రత పట్ల అవగాహన కల్పించడంలో, రోడ్డు ప్రమాదాలు నివారించడంలో విద్యార్థులు ఆదర్శంగా, ప్రచారకర్తలుగా ఉండాలి అన్నారు. మానవ తప్పిదాల వల్ల అధికంగా రోడ్డు ప్రమాదాలు సంభవించి ఎంతోమంది ప్రాణాలు కోల్పోతున్నారని ఏ ఒక్కరూ రోడ్డు ప్రమాదంలో ప్రాణం కోల్పోకూడదు అనేది పోలీస్ శాఖ లక్ష్యమని తెలిపారు. ప్రయాణ సమయంలో ముందస్తు జాగ్రత్తలతో సురక్షిత గమ్యం సాధ్యం అవుతుంది అన్నారు, డిఫెన్సివ్ డ్రైవింగ్ చేయాలి, మొబైల్ మాట్లాడుతూ వాహనం నడపవద్దు, మైనర్ డ్రైవింగ్ తో మీకు ఎదుటి వారికి ప్రమాదం సంభవిస్తుంది అన్నారు. రోడ్డుకు లెఫ్ట్ సైడ్ డ్రైవింగ్ ఆల్ వేస్ రైట్ అని తెలిపినారు. మనం క్షేమంగా ఉంటేనే అనుకున్న లక్ష్యాలు సాధిస్తాం. రోడ్డు ప్రమాదాల్లో వికలాంగులు అయితే జీవితం వ్యర్థం అవుతుంది, లక్ష్యం ఆవిరౌతుంది. ద్విచక్ర వాహనాలపై ప్రయాణించే సమయంలో వాహనం నడిపే వారు వెనక కూర్చుని ఉన్నవారు తప్పకుండా హెల్మెట్ ధరించాలి, కార్లు పెద్ద వాహనాల్లో ప్రయాణించేవారు సీటు బెల్ట్ పెట్టుకోవాలి అని కోరారు. మైనస్ డ్రైవింగ్ చేయడం వల్ల వాహనం నడిపేవారు ఇతరులు కూడా ప్రమాదంలో పడతారని అన్నారు. మద్యం మత్తులో వాహనాలు నడపకూడదని సూచించారు. అతివేగంగా వాహనాల నడపడం ప్రమాదం అన్నారు. ప్రతి వాహనానికి అన్ని అనుమతి పత్రాలు కలిగి ఉండాలని వాహనదారుడు లైసెన్స్ ఇన్సూరెన్స్ కలిగి ఉండాలని సూచించారు.
రోడ్డు ప్రమాదాల సమయంలో క్షతగాత్రులకు సహాయ సహకారులు అందించడం గోల్డెన్ ఆవర్ ను సద్వినియోగం చేయాలి, త్వరితగతిన ఆసుపత్రులకు చేర్చడం వల్ల క్షతగాత్రుల ప్రాణాలు కాపాడవచ్చు అన్నారు. రోడ్డు ప్రమాదాల్లో గాయపడ్డ వారికి బాధ్యతగా సహాయసహకారాలు అందించి ప్రాణాలు కాపీడితే రహదారి హీరోగా కీర్తించి నగదు ప్రోత్సాహకం అందించడం జరుగుతుంది అన్నారు.
హెల్మెట్ లేకపోతే విద్యా సంస్థలలోకి ద్విచక్ర వాహనాలు అనుమతించవద్దు. డ్రైవింగ్ లైసెన్స్ లేకపోతే వాహనం సీజ్ చేస్తాము. యువత నిర్లక్తంగా ఉండవద్దు, ఆదర్శంగా ఉండాలని కోరారు.
సైబర్ మోసాలకు గురికావద్దు.
సాంకేతికత అభివృద్ధి చెందిన కొద్దీ సైబర్ మోసగాళ్లు కొత్త తరహాలో ప్రజలను మోసగించి ఆర్థిక నష్టాలు కలిగిస్తున్నారు, అపరిచితులు ఏదైనా బహుమతులు ఉన్నాయని ఆశ చూపితే అత్యాశకు పోవద్దు వ్యక్తిగత సమాచారం అపరిచితులకు ఇవ్వవద్దని సూచించారు. ఇంటర్నెట్ నందు నకిలీ వెబ్సైట్ దర్శనమిస్తున్నాయని వాటిల్లో వ్యక్తిగత సమాచారాన్ని పంచుకున్నట్లయితే అవి సైబర్ మోసగాళ్ల చేతికి వెళ్లి ఆర్థిక నష్టాలు కలుగుతున్నాయని తెలిపారు. విద్యార్థులు ఇంటర్నెట్ సద్వినియోగం చేసుకోవడంలో సామాజిక మాధ్యమాలు ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ ట్విట్టర్ వాట్సప్ వంటివి వినియోగించేటప్పుడు నకిలీ వాటిని గుర్తించాలని వీటికి వచ్చే సందేశాలను అనుసరించి పెట్టుబడులు పెట్టవద్దని ఉద్యోగాలు ఇప్పిస్తామంటే డబ్బులు కట్టవద్దని కోరారు.
మొబైల్ పోతే సీఐఆర్-CEIR నందు ఫిర్యాదు చేయాలి.
విద్యార్థులు ఎవరైనా వారి యొక్క మొబైల్ ను పోగొట్టుకున్నట్లయితే వెంటనే సీఈఐఆర్ నందు ఫిర్యాదు నమోదు చేయాలని దీని ద్వారా పోయిన మొబైల్ ను గుర్తించవచ్చు అని అన్నారు. గత సంవత్సర కాలంగా 1500 పైగా మొబైల్స్ ను గుర్తించి బాధితులకు అందించడం జరిగిందని తెలిపారు.
ఈ కార్యక్రమం నందు ఎస్పీ గారి వెంట స్థానిక ఇన్స్పెక్టర్ వెంకటయ్య, స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ రామారావు, సూర్యాపేట పట్టణ ట్రాఫిక్ ఎస్ఐ సాయిరాం, కళాశాల ప్రిన్సిపల్ ముత్యాలరావు, కళాశాల సిబ్బంది శ్రీనివాస్, వెంకన్న, నాగరాజు, విద్యార్థులు, పోలీసు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.