పూర్వ ప్రైవేటు లెక్చరర్ల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం కోదాడలో

తెలంగాణ వార్త ప్రతినిధి కోదాడ :- పూర్వ ప్రవేటు లెక్చరర్ల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం..కోదాడ పట్టణం కొమ రబండ వై జంక్షన్ బైపాస్ వద్ద మామిడి తోటలో పూర్వ ప్రవేటు లెక్చరల్ల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. 1988 నుండి 2025 సంవత్సరం వరకు కోదాడ పట్టణంలో వివిధ ప్రైవేట్ కళాశాలలో పనిచేసి ప్రభుత్వ ఉద్యోగంలో జీవితంలో స్థిర పడిపోయి ఉన్న పూర్వ ప్రైవేటు లెక్చరర్లు కలయిక అపూర్వ సందర్భంగా నిర్వాహకులు ఎస్కే పాషా బూ రసైదయ్యగౌడ్ బడుగుల సైదులు మారం వెంకట్ రెడ్డి, ప మ్మీ సుధాకర్ రెడ్డి, చందా శ్రీనివాసరావు రాపర్తి రామనర్సయ్య, సనత్ కుమార్, నర్సిరెడ్డి, నరేందర్, పాల్గొని మాట్లాడినారు. ప్రతి సంవత్సరం ఈ కలయిక ఏర్పాటు చేయడం జరుగుతుందని, సమాజ హితం కోరి స్నేహం సహకారం సానుకూల దృక్పథంతో జీవనం కొనసాగించాలని అభిప్రాయపడినారు. తమతో కలిసి అధ్యాపక వృత్తిలో కొనసాగి ఇటీవల కాలంలో మరణం చెందిన బాణాలవెంకటరెడ్డి గుంటోజు అమరేందర్ సూర్య నాగేందర్ తోట రామారావు కొప్పుల తిరుమలరెడ్డి మేకల శ్రీనివాసరావు గాయం శ్రీనివాస్ రెడ్డి, మల్లికార్జున్, ప్రభాకర్, నాగభూషణలకు శ్రద్ధాంజలి ఘటించారు. మూడు దశాబ్దాల కాలంలో తమ వృత్తి సందర్భం ను గుర్తు చేసుకొని ఆత్మీయత అభిమానం సంతోషం పాటలతో ఆనందం గా గడిపారు.