వృద్ధ దంపతులు కు సహాయం అందించిన పోలీసులు

May 25, 2025 - 17:52
May 25, 2025 - 20:56
 0  35
వృద్ధ దంపతులు కు సహాయం అందించిన పోలీసులు

తెలంగాణ వార్త ఆత్మకూరు ఎస్ :- మండల పరిధిలోని దుబ్బ తండా గ్రామానికి చెందిన జాటోత్ తావురియా, భార్య బుజ్జమ్మ వృద్ద దంపతులను తన కుమారులు సరిగా చూడడంలేదు అనే విషయం పై ఒక వార్తా పత్రికలో వచ్చిన కథనానికి ఆదివారం పోలీసులు స్పందించారు.జిల్లా ఎస్ పి ఆదేశాల మేరకు సూర్యపేట రూరల్ CI రాజశేఖర్, ఆత్మకూర్ ఎస్, ఎస్ ఐ శ్రీకాంత్ గౌడ్ దుబ్బతండా లోని వృద్ధ దంపతుల కుటుంబాన్ని సందర్శించారు. వృద్దులను కలిసి వారి బాధలను తెలుసుకొన్నారు .తావురియా మొదటి భార్య సోనీ కు ఒక కుమారుడు ఇతడు ప్రస్తుతం ప్రభుత్వ వైద్యులు గా పని చేస్తున్నాడు. రెండు గదులు కలిగిన పెంకుటిల్లు పై కప్పు సరిగా లేదు. ప్రభుత్వం సరఫరా చేసే 12 కిలోల రేషన్ బియ్యం తింటున్నామని, తన కుమారుడు తమను సరిగా పట్టించుకోవడం లేదనీ తన కొడుకును పిలిపించి తమ పోషణ చూసే విధంగా చేసి న్యాయం చేయాలని వృద్ధ దంపతులు పోలీసులను కోరారు. వెంటనే CI తన కుమారునికి కు ఫోన్ చేసి అడగగా, నేను రేపు వచ్చి తన తల్లి తండ్రులకు కావలసిన అవసరాలు తీర్చే విధంగా చూసుకుంటాను అని హామీ ఇచ్చినట్లు తెలిపారు. ఈ సందర్భంగా వృద్ధ దంపతుల కు బియ్యం, కూరగాయలు, నిత్యావసర సరుకులు అందజేశారు.