పురాతనమైన శివలింగం ఆంజనేయుని విగ్రహాలు లభ్యం

Nov 12, 2025 - 05:06
 0  220
పురాతనమైన శివలింగం ఆంజనేయుని విగ్రహాలు లభ్యం

తిరుమలగిరి 12 నవంబర్ 2025 తెలంగాణ వార్త రిపోర్టర్

సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మండల కేంద్రంలోని అనంతారం గ్రామంలో 11వ శతాబ్దం కాకతీయ కాలం నాటి జీర్ణమైన సోమసూత్ర శివలింగం మరియు ఆంజనేయస్వామి విగ్రహాలు బయల్పడ్టం తో కార్తీక మాసంలో అనంతారం గ్రామం లో శివలింగం కి మొదటి అభిషేకం పూజా కార్యక్రమం నిర్వహించిన గ్రామ ప్రజలు మరియు వివిధ గ్రామాల శివ భక్తులు పాల్గొని భక్తితో శివలింగానికి పూజలు నిర్వహించారు...  ఇక్కడ శిలా శాసనాలు కూడా ఉన్నాయి వాటిపైన సోమ సూత్రాలు ఉన్నాయి అని ఇక్కడి ప్రజలు చెప్పుతున్నారు  కొన్ని వందల సంవత్సరాల క్రితం ఈ శివాలయం పక్కన అనంతారం గ్రామం ఉండేదని ఇక్కడి ప్రజలు చెప్పుతున్నారు   ఎంతో ప్రాముఖ్యత కలిగిన ఈ శివ లింగం మా గ్రామంలో ఉండడం మా అదృష్టం అని గ్రామస్తులు చెపుతున్నారు  వీటిని ఎవరూ దొంగిలించకుండా ఈ సంపదను ఎవరూ ఎత్తుకెళ్ళకుండా ప్రభుత్వము తక్షణమే పలు జాగ్రత్తలు తీసుకోవాలి అని గ్రామస్తులు అంటున్నారు  దేవాదాయ శాఖ మరియు పురావస్తు శాఖ అధికారులు తక్షణమే పలు జాగ్రత్తలు తీసుకోవాలి అని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు  ఇంకా ఎన్నో విలువైన సంపదలు కూడా వుండవచ్చు అని గ్రామస్తులు అంటున్నారు

జేరిపోతుల రాంకుమార్ తిరుమలగిరి విలేకరి మరియు తుంగతుర్తి నియోజకవర్గం ఇన్చార్జి