ఏజెన్సీలో అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు
ఏజెన్సీలో అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు
తెలంగాణ వార్త , (నుగూరు)వెంకటాపురం, ఫిబ్రవరి 23: ములుగు జిల్లా ఏజెన్సీ వెంకటాపురం మండలం లో డివిజన్ కేంద్రమైన భద్రాచలంలో కార్పొరేట్ స్థాయి అత్యాధునిక వైద్య సేవలను పేద ప్రజలకు అందుబాటులోకి తీసుకు వచ్చినట్లు నేతాజీ హాస్పిటల్ వైద్య నిపుణులు డాక్టర్ హేమంత్ కాకర్ల, డాక్టర్ శ్రీనివాస్ గడ్డం,లు తెలిపారు. ఆదివారం వెంకటాపురం మండల కేంద్రంలో యువన్ మోటార్స్ నందు భద్రాచలం నేతాజీ హాస్పిటల్ ఆధ్వర్యంలో జరిగిన ఉచిత వైద్య శిబిరం ను వారు ప్రారంభించి మాట్లాడారు. ఆర్థోపెడిక్ రంగంలో మోకాళ్ళ కీళ్ల మార్పిడి, ఎముకలకు ,రోడ్డు ప్రమాదాల బాధితులకు 24 గంటలు ఎమర్జెన్సీ వైద్య సేవలను అందిస్తున్నట్లు పేర్కొన్నారు. అదేవిధంగా అత్యాధునిక ల్యాపరోస్కోపీ శస్త్ర చికిత్సలను పేద, మధ్య తరగతి ప్రజలకు అందుబాటులో నిపుణులైన వైద్యులతో అందిస్తున్నట్లు తెలిపారు. చిన్న, పెద్ద ఆపరేషన్, అపెండిక్స్, గాల్ బ్లాడర్, కిడ్నీలలో రాళ్లు, పైల్స్ ఫిస్టులా లకు లేజర్ చికిత్సలు గ్యాస్ సంబంధిత బాధలకు నివారణ చూపించబడునని తెలిపారు. అత్యంత క్లిష్టమైన ఆపరేషన్లను సైతం తమ ఆసుపత్రిలో చేసి జీవన దానం చేసినట్లు వెల్లడించారు. ఈ సందర్భంగా 200 మందికి ఉచితంగా పరీక్షలు నిర్వహించి మందులను సైతం అందజేశారు. అదేవిధంగా రూ 2,500 విలువగల బిఎండి టెస్టును ఉచితంగా అందజేశారు. ఈ శిబిరంలో హాస్పిటల్ యాజమాన్యం తరఫున జక్కిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, మల్లంపాటి నరసింహారెడ్డి స్థానిక ప్రముఖులు సాధన పల్లి విజయ్ , కిరణ్ , హాస్పిటల్ సిబ్బంది పాల్గొన్నారు.