అనారోగ్యం తో మరణించిన  పోలీసు కుటుంబానికి చెక్ అందజేసిన జిల్లా ఎస్పీ శ్రీ టి . శ్రీనివాస రావు,IPS గారు

Aug 21, 2024 - 18:05
Aug 21, 2024 - 18:05
 0  2
అనారోగ్యం తో మరణించిన  పోలీసు కుటుంబానికి చెక్ అందజేసిన జిల్లా ఎస్పీ శ్రీ టి . శ్రీనివాస రావు,IPS గారు

జోగుళాoబ గద్వాల్ జిల్లా పోలీస్

  అనారోగ్యం కారణంగా మరణించిన పోలీస్ అధికారి కుటుంబ సభ్యురాలుకు     జిల్లా ఎస్పీ శ్రీ టి.శ్రీనివాస రావు,IPS గారు కార్పస్ ఫండ్ క్రింద 49,800/- రూపాయాల చెక్ ను, విడో పెన్షన్ క్రింద 10,000/- రూపాయాల చెక్ ను అందజేసారు.

ఇటిక్యాల పోలీస్ స్టేషన్ లో హెడ్ కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్న ప్రసాద్ గారు  ఈ సంవత్సరం జనవరి నెలలో అనారోగ్యం తో  మరణించగా  వారి కుటుంబ సభ్యులకు కార్పస్ ఫండ్ క్రింద 49,800/- విడో పెన్షన్ క్రింద  10,000/-  రూపాయల చెక్ ను    జిల్లా  ఎస్పీ గారు అందజేశారు


ఈ సందర్భంగా  జిల్లా ఎస్పీ గారు వారి కుటుంబ స్థితి గతులను, వారి పిల్లల విద్యా అభ్యసన వివరాలను తెలుసుకొని మాట్లాడుతూ విధి నిర్వహణలో మరణించిన పోలీస్ కుటుంబాలకు అన్ని వేళలా అండగా ఉంటూ వారి సంక్షేమానికి కృషి చేస్తామని అన్నారు. వారి కుటుంబానికి రావాల్సిన మిగిలిన బెనిఫిట్స్ అన్ని కూడా త్వరగా వచ్చేందుకు కృషి చేయాలని కార్యాలయ ఏ
ఓ గారిని ఆదేశించారు.

    ఈ కార్యక్రమములో కార్యాలయ ఏ. ఓ సతీష్ గారు, హెడ్ కానిస్టేబుల్  భార్య రాజేశ్వరి పాల్గొన్నారు.

జిల్లా పోలీస్ కార్యాలయం
జోగుళాoబ గద్వాల్ జిల్లా

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333