పిల్లలమర్రి లో నేత్రపర్వంగా రథోత్సవం

Feb 28, 2025 - 14:00
Feb 28, 2025 - 16:33
 0  13
పిల్లలమర్రి లో నేత్రపర్వంగా రథోత్సవం

సూర్యాపేట: 

మున్సిపల్ పరిధిలోని పిల్లలమర్రి లో మహా శివరాత్రి వేడుకలలో భాగంగా నిర్వహించిన రథోత్సవం నేత్రాపర్వంగా జరిగింది. శుక్రవారం తెల్లారుజామున మహాదేవ నామేశ్వర స్వామి దేవాలయం నుండి ఏరకేశ్వరస్వామి దేవాలయం వరకు గ్రామ పురవీధుల్లో ఊరేగింపు చేశారు. ముందుగా దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి సంప్రదాయ బద్దంగా స్వామి వార్ల ఉత్సవ విగ్రహాలను రథం పైకి తీసుకువచ్చారు. డప్పుల చప్పుళ్ళు, డిజె సౌండ్ సందడితో మహిళలు కొలాటలు చేస్తూ రథసేవలో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఆలయ అర్చకులు మునగలేటి సంతోష్ శర్మ సమక్షంలో జరిగిన ఈ కార్యక్రమంలో దేవాలయ కమిటి చైర్మెన్ గవ్వ వెంకటకృష్ణరెడ్డి, డైరెక్టర్లు చిత్తలూరి సతీష్, చెరుకుపల్లి బుచ్చి రాములు, వల్లాల జానీ యాదవ్, నక్కల సైదులు, బట్టు నాగరాజు యాదవ్, చెరుకుపల్లి కృష్ణయ్య, మొగిలి ఎల్లయ్య, ఎర్రంశెట్టి వెంకటేష్, ఓబల్లోజు చంద్రశేఖర్, రాయల భారతమ్మ, చింత సునంద, షేక్ జానీ మియా గ్రామస్తులు, భక్తులు పాల్గొన్నారు.

GireeshKumar Ekalavya విలేకరులు కావలెను No డిపాజిట్..! No టార్గెట్..! న్యూస్ లు మీవి ...! పబ్లిష్ మాది ..! చేయవాల్సిందల్లా ఒక్కటే న్యూస్ సేకరించడం. ఆ న్యూస్ ను పబ్లిక్ లోకి తీసుకపోవడం ప్రముఖ మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి న్యూస్ ఛానల్, పేపర్, వెబ్సైట్ చూసుకుంటుంది. మా న్యూస్ ఛానల్ నందు పనిచేయుటకు మండలాల వారిగా విలేకరులు కావలెను. సంప్రదించవలసిన నెంబర్ 9063881333