పాస్టర్ ప్రవీణ్ పగడాల అనుమానస్పద మృతికి నిరసన
జోగులాంబ గద్వాల 1 ఏప్రిల్ 2025 తెలంగాణ వార్తా ప్రతినిధి: గద్వాల. జిల్లా క్రైస్తవ సంఘాలు పాస్టర్ ప్రవీణ్ అభిమానులు వేలాదిగా తరలివచ్చి శాంతియుతంగా భారీ నిరసన ర్యాలీని చేపట్టి పాస్టర్ ప్రవీణ్ అనుమానాస్పద మృతిపట్ల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిజనిజాలు నిగ్గుతేల్చి దోషులను ఎంతటి వారైనా కఠినంగా శిక్షించాలని, ఇలాంటి సంఘటనలు భవిష్యత్తులో మరోసారి జరగకుండా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ర్యాలీలో క్రైస్తవులు పాస్టర్ ప్రవీణ్ మృతిపట్ల ఆయన చేసిన బైబిల్ వాక్యం రూపంలో మతాలతో సంబంధం లేకుండా మనిషిని మనిషిగా గౌరవించాలని ఆయన ఆధ్యాత్మిక సేవలను కొనియాడుతూ పాటల రూపంలో బైబిల్ నుండి వాక్యం రూపంలో నినాదాలతో పాస్టర్ ప్రవీణ్ పగిడాల మృతి పట్ల క్రైస్తవులు తమ మదిలో స్మరించుకుని ఐదు నిమిషాలు మౌనం పాటించి వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు టీచర్ ఆర్ మోహన్. హనుమంతు. ఉదయ్ కిరణ్. టీచర్ ఇమాన్యుల్. మాజీ ఉప సర్పంచుల సంఘం అధ్యక్షుడు రంజిత్ కుమార్ చిన్న పాడు దండోరా ఆంజనేయులు. ఎమ్మార్పీఎస్ అశోక్. గంజిపేట పాల్. జంషెడ్ ఆనంద్. జంషెడ్ ప్రవీణ్. జంషేడు నరసింహ. తిమోజి. మోషే. దేవరాజ్. హనుమన్న. అంజి. జీవరత్నం. రమేష్. తదితరులు పాల్గొన్నారు.