సంఘటిత ప్రతిఘటన పోరాటాల ద్వారా బుద్ధి చెబుతాం. CITU,AITUC TUCI, IFTU
జోగులాంబ గద్వాల తొమ్మిది జులై 2025 తెలంగాణ వార్త ప్రతినిధి : లేబర్ కోడ్ ల ద్వారా కార్మిక వర్గ హక్కులను కాలరాస్తున్న బిజెపికి వ్యతిరేకంగా సంఘటిత, ప్రతిఘటన పోరాటాల ద్వారా బుద్ధి చెబుదామని సిఐటియు రాష్ట్ర కార్యదర్శులు కోటంరాజు, TUCI రాష్ట్ర అధ్యక్షులు సూర్యం ,అన్నారు. దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో భాగంగా జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలో జరిగిన సమ్మెకు ముఖ్య అతిథిలుగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కార్మిక వర్గాన్ని సంఘటితం చేసి తీవ్ర ప్రతిఘటన పోరాటాల ద్వారా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన లేబర్ కోడ్ లకు వ్యతిరేక పోరాటాల ద్వారా బుద్ధి చెబుతామని అన్నారు. భారతదేశ చరిత్రలో నేడు చేపట్టిన దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె చిరస్థాయిగా నిలిచిపోతుందని అన్నారు. 29 కార్మిక చట్టాలను రద్దుచేసి పారిశ్రామిక వివాదాల కోడ్,వేతనాల కోడ్ సామజిక భద్రత కోడ్ కార్మికుల పని ఆరోగ్యం ఉద్యోగ భద్రతకు సంబంధించిన కోడ్ లుగా మార్చారని విమర్శించారు. పారిశ్రామిక సంబంధాల కోడ్ ద్వారా నియామకం తొలగింపు సంఘానికి ఏర్పాటు చేసుకునే హక్కు లేకపోవడం వంటి హక్కుల పై ఉక్కు పాదం మోపారని, కనీస వేతనాల కోడ్ ద్వారా మూడు చట్టాలను రద్దు చేసి రోజుకు 178 రూపాలుగా మినిమం ఫ్లోర్ నిర్ణయించి నెలకు కేవలం 4628 రూపాయలతో కార్మికులను బిక్షగాలుగా మార్చారని విమర్శించారు. సామాజిక భద్రతా చట్టం ద్వారా 13 చట్టాలను రద్దుచేసి కార్మికుల భద్రత యాజమాన్యాలతో సంబంధం లేకుండా పెట్టుబడిదారుల దయ దక్షిణ్యాల మీద ఆధారపడే విధంగా చేశారని విమర్శించారు. కార్మికుల ఆరోగ్యం ఉపాధి పని పరిస్థితులను గాలికి వదిలేసి దోచుకోవడమే లక్ష్యంగా నాలుగు కార్మిక చట్టాలను తీసుకువచ్చి కార్మికులపై రుద్దారని విమర్శించారు.చికాగో అమరవీరుల స్ఫూర్తితో బ్రిటిష్ సామ్రాజవాదాన్ని ఎదిరించి సాధించుకున్న కార్మిక వర్గ హక్కులను కాపాడుకునేందుకు భారతదేశ కార్మిక వర్గం త్యాగాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. కేంద్ర ప్రభుత్వ నిర్బంధ అప్రకటిత ఎమర్జెన్సీ విధానాల వల్ల దేశంలో కార్మిక వర్గం సర్వం కోల్పోయి దేశ ఉత్పాదకత దిగజారే స్థితికి వచ్చిందని విమర్శించారు.సంపద సృష్టికర్తలకు విలువ ఇవ్వకుండా బడా బాబుల జోబులు నింపుతూ వారి ఎంగిలి మెతుకులు తినే నీచులకు కార్మిక వర్గం తగు రీతిలో బుద్ధి చెప్పాలని అన్నారు. కార్మిక చట్టాల వల్ల ఇష్టా రీతిలో కార్మిక వర్గాన్ని దోపిడీ చేసి వారి జీవన ప్రమాణాలను తగ్గించి వారి ఆయువును సైతం హరించే బిజెపి నిరంకుశ మతోన్మాద విధానాలకు వ్యతిరేకంగా దేశం యావత్ కార్మిక వర్గం సంఘటితంగా ప్రతిఘటన పోరాటాల ద్వారా బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు.రాష్ట్రంలోని కాంగ్రెస్ పార్టీ కూడా నరేంద్ర మోడీ అడుగులకు మడుగులతో వారి విధానాలను అనుసరిస్తున్నదని విమర్శించారు ఒకవైపు దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెకు సన్నద్ధమవుతున్న నతరుణంలో రాష్ట్రంలో పని గంటలను పెంచుతూ 282 జీవో జారీ చేయడం కార్మిక వర్గాన్ని అవహేళన చేయడమే అని అన్నారు. పెట్టుబడిదారుల జెండావేరైనా అజెండా ఒకటే అని కార్మికులను దోచుకునే విధానాలలో మార్పులు లేదని కార్మిక వర్గ ఐక్య పోరాటాల ద్వారా వారికి బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమం లో తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వెంకటయ్య తెలంగాణ ప్రజా ఫ్రంట్ రాష్ట్ర కోశాధికారి సుంకర ప్రభాకర్ AITUC జిల్లా అధ్యక్షులు ఆంజనేయులు TUCI జిల్లా అధ్యక్షులు హనుమంతు, CITU జిల్లా కార్యదర్శి వివి నరసింహ, ఉపాధ్యక్షులు ఉప్పేరు నరసింహ TUCI జిల్లా కార్యదర్శి ఎం కృష్ణ AITUC ఎల్కూర్ రంగన్న boc జిల్లా నాయకులు ప్రేమ రాజు శేషన్న, ప్రైవేట్ స్కూల్ డ్రైవర్స్ బీచుపల్లి పెయింటర్స్ సలీం వివిధ సంఘాల నాయకులు brsv కుర్వ పల్లయ్య brskv గంజి పేట రాజు బహుజన రాజ్య సమితి వినోద్ tpf నాగన్న tuci చింతరేవుల కృష్ణ aituc ఎల్కూర్ రంగన్న aisf ప్రవీణ్ pdsu హాలీమ్ పాషా sfi వినోద్ dyfi ఉప్పేర్ అంజి ఆశ వర్కర్ల యూనియన్ అధ్యక్ష కార్యదర్శులు పద్మ సునీత గ్రామపంచాయతీ వర్కర్స్ యూనియన్ అధ్యక్షులు సిద్దయ్య రంగన్న, 104 ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షులు బీచుపల్లి VOA ల సంఘం జిల్లా అధ్యక్షుడు డ్యాం అంజి సివిల్ సప్లై యూనియన్ జిల్లా ఉపాధ్యక్షులు శివ మున్సిపల్ యూనియన్ అధ్యక్ష కార్యదర్శులు శివ రవి ప్రభుత్వ పాఠశాలల కార్మికుల సంఘం రఘు వసతి గృహ కార్మికుల సంఘం శశికళ పార్వతి దోబీ కార్మికులు వీరేష్ రవాణా రంగ కార్మికులు వెంకటేష్ అంగన్ వాడి లు ఆయాలు రిక్షా కార్మికులు ధర్మన్న వివిధ రాజకీయ ప్రజా సంఘాల నాయకులు నాగర్ దొడ్డి వెంకట్రాములు అతికూరు రెహమాన్ పాల్గొన్నారు.